అస్సాం అందాల సుగంధం.. టాలీవుడ్ వెండితెరపై ఇప్పుడు మత్తెక్కిస్తోంది! గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతూనే, నటనతోనూ కట్టిపడేస్తున్న ఆ బ్యూటీ పేరు 'కయాదు లోహర్'. ఒకప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూసిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస ఆఫర్లతో టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ భామ తలుపును ఇప్పుడు అదృష్టం గట్టిగానే తడుతోంది. ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంటోంది.
టాలీవుడ్ సెన్సేషన్.. బంపరాఫర్ కొట్టేసిన భామ!
దర్శకుడు అనిల్ రావిపూడి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏ సినిమా తీసినా అందులో వినోదం గ్యారెంటీ! ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో వెంకీ మామ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా.. కల్యాణ్ రామ్ జోడీగా మన కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది.
అపజయం ఎరుగని అనిల్ రావిపూడి లాంటి బ్రాండ్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ రావడం అంటే.. ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కు అది తిరుగులేని టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. హీరోయిన్ల పాత్రలను వైవిధ్యంగా డిజైన్ చేసే అనిల్ సినిమాలో కయాదు తన మార్క్ చూపిస్తే.. ఇక టాలీవుడ్‌లో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు.
పరాజయాలు పలకరించినా.. తగ్గని క్రేజ్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు జోడీగా ఇటీవల 'ఫంకీ' అనే సినిమాతో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది కయాదు లోహర్. అయితే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడక పరాజయం పాలైంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, కయాదు అందచందాలకు మాత్రం ప్రేక్షకులు పూనకాలు వచ్చినట్లు ఫిదా అయిపోయారు.
ఆ క్రేజ్‌తోనే ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీద ఉండగానే, ఇప్పుడు అనిల్ రావిపూడి లాంటి మరో బంపరాఫర్ పట్టేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
డ్రాగన్ ఇచ్చిన కిక్.. సామాన్య యువతి స్టార్‌డమ్!
అసలు కయాదు లోహర్ సినీ ప్రయాణం 2021లో వచ్చిన కన్నడ చిత్రం 'మొగిల్‌పేట'తో మొదలైంది. ఆ తర్వాత 2022లో శ్రీవిష్ణు హీరోగా నటించిన 'అల్లూరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో తన గ్లామర్‌తో పాటు, రొమాంటిక్ సీన్లలో ఏమాత్రం మొహమాటం లేకుండా రెచ్చిపోయి కుర్రాళ్ల మనసులు దోచేసింది. కానీ ఆ సినిమా యావరేజ్ రిజల్ట్ ఇవ్వడంతో, ఆమెకు ఆశించిన స్థాయిలో ఇక్కడ అవకాశాలు రాలేదు.
సరిగ్గా అప్పుడే తమిళంలో ప్రదీప్ రంగనాథ్ సరసన నటించిన 'డ్రాగన్' సినిమా ఆమె జాతకాన్నే మార్చేసింది. ఆ సినిమా సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మకు బడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, వెండితెరపై హీరోయిన్ కావాలనే కలను నిజం చేసుకోవడానికి తాను ఎంతగానో కష్టపడ్డానని కయాదు గతంలోనే చెప్పుకొచ్చింది. ఆ కష్టమే ఇప్పుడు ఆమెను స్టార్ హీరోయిన్ల రేసులో నిలబెడుతోంది.
ఒకప్పుడు ఆఫర్ల కోసం ఎదురుచూసిన కళ్లు.. ఇప్పుడు ఏ సినిమా ఒప్పుకోవాలో అని ఆలోచించే స్థాయికి ఎదగడం నిజంగా ఒక సినిమాటిక్ బ్లాక్ బస్టర్ స్టోరీ! మున్ముందు ఈ అస్సాం బ్యూటీ ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి!
Also Read:
ధురంధర్ 2 కాంట్రవర్సీ.. సిగరెట్ సీన్‌పై మాధవన్ క్లారిటీ!కుర్ర హీరోలకు సవాల్: బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న మోహన్ లాల్
Akshay Kumar | ధురందర్ అడల్ట్ మూవీ.. భూత్ బంగ్లా ఫ్యామిలీ సినిమా!
Ranveer Singh Dhurandhar 2 Collections: కంటెంట్ సత్తా.. తెలుగులో ఆదరణ చూసి షాక్ లో బాలీవుడ్ మేకర్స్!
Box Office Report: ఉగాది బరిలో 'ధురంధర్ 2' సునామీ.. బాక్సాఫీస్ దాటికి విలవిలలాడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'

