I-PAC Prashant Kishor : పీకేకు అఖిలేష్ బిగ్ షాక్!

naveen
By -
visualization showing Akhilesh Yadav looking determined with Prashant Kishor and I-PAC logo fading in the background


మీ ఓటును మీ నాయకుడు అడుగుతున్నాడా? లేక తెరవెనుక ఉండి కథ నడిపించే కార్పొరేట్ ఏజెన్సీలు అడుగుతున్నాయా? ప్రజాస్వామ్యంలో వేల కోట్లు తీసుకుని రాజకీయ పార్టీలను గెలిపించే కార్పొరేట్ వ్యూహకర్తల అసలు రంగు బయటపడుతుంటే.. ఒక సామాన్యుడిగా మీరు కచ్చితంగా ఆలోచించాలి. నిన్నటి దాకా దేశ రాజకీయాలను శాసించిన ఒక అతిపెద్ద పాలిటికల్ మైండ్ గేమ్‌కు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడబోతోంది!


ప్రశాంత్ కిశోర్‌కు అఖిలేష్ ఊహించని షాక్!


దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా చెరగని ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిశోర్ (పీకే) కు ఉత్తరప్రదేశ్‌లో బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులో దళపతి విజయ్‌ను గెలిపించడంలో పార్ట్-టైం సలహాదారుడిగా పనిచేసిన పీకే వ్యూహాత్మక సంస్థ 'ఐప్యాక్' (I-PAC) కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ).. ఇకపై ఐప్యాక్ సేవలు తమకు ఏమాత్రం అవసరం లేదని తేల్చిచెప్పేసింది. వచ్చే ఏడాది (2027) యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అరెస్టులు, ఘోర పరాజయాలు.. అసలు కారణాలివే!


సమాజ్‌వాదీ పార్టీ 2027 ఎన్నికల ముందు ఐప్యాక్‌తో తెగదెంపులు చేసుకోవడం వెనుక రెండు అతిపెద్ద కారణాలు దాగి ఉన్నాయి. మొదటిది.. ఐప్యాక్ విశ్వసనీయతను దెబ్బతీసిన ఈడీ అరెస్టు! పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కుంభకోణం కేసులో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చాందెల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హవాలా మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయల నల్లధనం ఐపాక్‌కు తరలిందన్న ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.


ఇక రెండో కారణం.. తాజా ఎన్నికల్లో ప్రతిపక్షాల ఘోర పరాజయం! ఐపాక్ పనిచేసిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు చిత్తుగా ఓడిపోయాయి. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని మట్టికరిపించి బీజేపీ ఏకంగా 207 సీట్లతో జయకేతనం ఎగురవేసింది. అటు తమిళనాడులో అధికార డీఎంకేను ప్రజలు గద్దె దించారు. వీటన్నింటికీ మించి.. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లాంటి ఉద్ధండులు తమ కంచుకోటల్లాంటి సొంత నియోజకవర్గాల్లోనే ఘోరంగా ఓడిపోవడం అఖిలేష్‌కు అతిపెద్ద షాక్‌గా మారింది.


మా దగ్గర డబ్బుల్లేవ్.. మీడియాపై జోక్ చేసిన అఖిలేష్


నిజానికి, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో సమాజ్‌వాదీ పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో.. గెలుపు వ్యూహాలు రచించే బాధ్యతను ఐపాక్‌కే అప్పగించారు. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. ఐప్యాక్ వైఫల్యం, అరెస్టుల గురించే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న ప్రశ్నకు అఖిలేష్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. "అవును, వాళ్లు కొన్ని నెలలు మాతో కలిసి పనిచేశారు. కానీ వారికి ఇచ్చేంత భారీ నిధులు మా దగ్గర లేవు. మీరు (మీడియాను ఉద్దేశించి) ఫండ్స్ ఇస్తే.. మరో కొత్త సంస్థను కూడా పెట్టుకుంటాం" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ పరాజయాలతో తమ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని పైకి కవర్ చేసే ప్రయత్నం చేశారు.


షోటైమ్‌తో దోస్తీ.. యూపీలో చాపచుట్టేసిన ఐప్యాక్!


ఐపాక్‌తో విడిపోయినా, ఎస్పీ ఎన్నికల ప్రచార వ్యూహాల కోసం 'షోటైమ్' (Showtime) అనే మరో ఏజెన్సీతో మాత్రం తమ ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగిస్తుండటం గమనార్హం. మరోవైపు ఈడీ దర్యాప్తు, వైఫల్యాల నేపథ్యంలో ఐపాక్ ఇప్పటికే యూపీలో తన కార్యకలాపాలను పూర్తిగా తగ్గించేసింది. తమ బృందాలను చాలా చిన్నవిగా మార్చేయడంతో ఎస్పీ ఎన్నికల సన్నాహాలకు తీవ్ర విఘాతం కలిగింది.


అఖిలేష్‌కు డూ ఆర్ డై.. ముందున్నది మొసళ్ల పండుగ!


2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు అఖిలేష్ యాదవ్‌కు నిజంగా 'చావో రేవో' (డూ ఆర్ డై) లాంటివి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఢీకొట్టే ఏకైక బలమైన ప్రత్యామ్నాయం సమాజ్‌వాదీ పార్టీనే అని అందరూ భావిస్తున్నారు. కానీ, సరిగ్గా ఎన్నికల ముందు ఐపాక్ దూరం కావడం, ఈడీ కేసుల భయం, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ఘోర పరాజయాలు.. ఇవన్నీ అఖిలేష్ ముందున్న అతిపెద్ద సవాళ్లు.


నాయకుడికి ప్రజలతో నేరుగా సంబంధం తెగిపోయినప్పుడే.. కోట్లు తీసుకునే ఇలాంటి కార్పొరేట్ 'ప్యాకేజీ' ఏజెన్సీల అవసరం పడుతుంది. ప్రజల నాడిని కార్పొరేట్ సంస్థలు, ల్యాప్‌టాప్‌లు ఎల్లప్పుడూ పట్టుకోలేవని బెంగాల్, తమిళనాడు ఫలితాలు నిరూపించాయి. సొంత ఏజెన్సీల నేతలే హవాలా కేసుల్లో జైలుకెళ్తుంటే, ఇక వారు సామాన్యుడి ఓటును ఎలా మలుపు తిప్పుతారు? అఖిలేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయనకు ఒక మేల్కొలుపు కావాలి. రాబోయే ఎన్నికల్లో అఖిలేష్ గ్రౌండ్ రియాల్టీని నమ్ముకుని సొంత కేడర్‌తో పోరాడితే గెలుస్తాడు, లేదంటే కేవలం 'షోటైమ్' లాంటి కార్పొరేట్ ఏజెన్సీలను నమ్ముకుంటే స్టాలిన్, మమతలకు పట్టిన గతే ఆయనకూ పట్టడం ఖాయం!


Tags: