మీ కదలికలను 24 గంటలూ ఓ కెమెరా గమనిస్తుంటే ఎలా ఉంటుంది? పాత మిత్రుడితో పంచుకున్న పర్సనల్ విషయాలు కూడా బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంటే.. ఆ ఊపిరాడని పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి! ప్రతి సామాన్యుడి ప్రైవసీకి ఈ సోషల్ మీడియా 'కంటెంట్ కల్చర్' ఎంత పెద్ద ముప్పుగా మారిందో చెప్పడానికి కింగ్ కోహ్లీ పడుతున్న ఈ ఆవేదనే సజీవ సాక్ష్యం.
ఊపిరి తీయనివ్వని 'కంటెంట్' పిచ్చి!
ఐపీఎల్ 2026 సీజన్‌లో తన బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న విరాట్ కోహ్లీ.. మైదానం బయట మాత్రం తీవ్ర అసహనంతో రగిలిపోతున్నాడు. మయాంతి లాంగర్ హోస్ట్‌గా జరిగిన 'ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్'లో ఆయన పేల్చిన బాంబులు ఇప్పుడు క్రీడా లోకాన్ని కుదిపేస్తున్నాయి. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లు వ్యూస్ కోసం చేస్తున్న ఈ దిక్కుమాలిన కంటెంట్ క్రియేషన్‌పై కోహ్లీ నిప్పులు చెరిగాడు.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి గ్రౌండ్ వరకు తాను ఎవరితో మాట్లాడినా వార్త వండివారుస్తున్నారని, కనీసం స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ఈ ఫ్యాన్ పేజీల గోల మొదలైందని, ఈ అతి కల్చర్‌పై తక్షణమే నియంత్రణ ఉండాలని ఆయన స్పష్టం చేశాడు.
స్నేహాన్ని అమ్ముకునే 'రోబో'లు!
కోహ్లీ, కేన్ విలియమ్సన్.. అండర్-19 రోజుల నుంచి ప్రాణమిత్రులు. మొన్నటికి మొన్న వీరిద్దరూ మైదానంలో కలుసుకుని ఏదో సీరియస్‌గా ముచ్చటించుకుందామని ప్రయత్నించారు. కానీ, కంటెంట్ కోసం ఫ్రాంచైజీలు పంపిన 'చంపక్' అనే ఒక రోబో కెమెరా వాళ్ళ ఏకాంతాన్ని కెలికేసింది. "దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వండి" అని ఆ కెమెరా ఆపరేటర్‌ను కోహ్లీ స్వయంగా బతిమాలుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ఒక పాత స్నేహితుడితో మాట్లాడే క్షణాలను కూడా 'కేన్ మామతో కింగ్ కోహ్లీ' అనే ట్యాగ్‌లైన్‌తో అమ్ముకోవాలని చూడటం అత్యంత దారుణమని కోహ్లీ విమర్శించాడు. ఇలాంటి పిచ్చి చర్యల వల్ల తనకు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు.
ప్రాక్టీస్ కూడా పాపమేనా? కెమెరాల కనుసన్నల్లో ఆటగాళ్లు!
గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంత ఒత్తిడి ఉన్నా తాను ఇష్టపడతానని, కానీ ఈ కెమెరాల నిఘా వల్ల వచ్చే అసహజమైన ఒత్తిడిని భరించలేనని కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం బయటికి రాగానే కెమెరాలు గుంపులుగా వచ్చి వెంబడిస్తున్నాయి.
ఏ షాట్ ఆడుతున్నాం? నెట్స్‌లో ఎలాంటి సన్నాహాలు చేస్తున్నాం? అని ప్రతి చిన్న కదలికను రికార్డ్ చేసి విశ్లేషిస్తుండటంతో ఆటగాళ్లలో తీవ్రమైన భయం మొదలైంది. మ్యాచ్‌లో ఆడే ఆటను బట్టి మాత్రమే అంచనా వేయాలని, ప్రాక్టీస్ సెషన్స్‌ను కూడా పోస్ట్‌మార్టం చేయడం ఏమాత్రం సరికాదని ఆయన తేల్చి చెప్పాడు. అసలు కెమెరాల నిఘాలో ఉండటం ఆటగాళ్లకు ఇష్టమేనా అన్న కనీస స్పృహ బ్రాడ్‌కాస్టర్లకు లేకపోవడం దురదృష్టకరం.
సోషల్ మీడియాలో అభిమానుల కోసం ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు. కానీ, ఒక మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వారిని కేవలం ఒక 'ప్రొడక్ట్'గా మార్చేయడం ఆధునిక బ్రాడ్‌కాస్టింగ్ చేస్తున్న అతిపెద్ద తప్పు. ఆటగాళ్లకు ప్రశాంతత కరువైతే.. రేపు మైదానంలో మనం ఆశించే అసలైన సహజమైన ఆట కనుమరుగవ్వడం ఖాయం. దేశం గర్వించే కింగ్ కోహ్లీ లాంటి అగ్రశ్రేణి ఆటగాడికే ప్రైవసీ దొరకనప్పుడు, రేపు సోషల్ మీడియా పిచ్చితో మన వ్యక్తిగత జీవితాలు కూడా ఇలాగే పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారకముందే సామాన్యులు కూడా ఒక 'డిజిటల్ బౌండరీ' గీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది!
Also Read:
ICC WTC Points Table: పాకిస్థాన్‌కు ఐసీసీ భారీ షాక్India vs Bangladesh : బీసీబీ పశ్చాత్తాపం.. త్వరలో సిరీస్!
Virat Kohli Manjrekar : విరాట్ కోహ్లీ మనస్తత్వంపై మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు 150 గగనం.. ఇప్పుడు 280 దాటుతున్న స్కోర్లు, మారిన ఐపీఎల్ తీరు!
పాకిస్థాన్‌లో ఒక్కడూ సరిపోడు: వైభవ్ సూర్యవంశీపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు

