బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కృతి సనన్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ, రేపు (ఆగస్టు 14) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2012లో దీపికా పదుకొనే నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'కాక్‌టెయిల్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపై ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
[FEATURED_IMAGE]
2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'కాక్‌టెయిల్' బాక్సాఫీస్ వద్ద, మ్యూజికల్‌గా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు దర్శకుడు హోమీ అదజానియా 'కాక్‌టెయిల్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ స్పిరిచ్యువల్ సీక్వెల్‌లో షాహిద్ కపూర్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకోగా, సౌత్ సెన్సేషన్ రష్మిక మందన్న, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ తమ నటనతో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇటీవల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
దినేష్ విజన్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రేపు (ఆగస్టు 14) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఒరిజినల్ హిందీ భాషలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ యాక్టర్ పుల్కిత్ సామ్రాట్ ఓ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా, సీనియర్ నటుడు టికు తల్సానియా కీలక పాత్ర పోషించారు.
పాత కాక్‌టెయిల్ మూవీకి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్, ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం అందించడం విశేషం. థియేటర్లలో ఒక సెక్షన్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్లోబల్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

