అనిల్ రావిపూడి మాయ చేశాడా.. యశ్ రిక్వెస్ట్ చేశాడా? లేడీ సూపర్ స్టార్‌లో ఈ మార్పేంటి!

naveen
By -
Nayanthara Attends Toxic Movie Promotions

లేడీ సూపర్ స్టార్ నయనతార అంటేనే సినిమా ప్రమోషన్స్‌కు ఆమడదూరం. "మీరు అదనంగా ఇంకో కోటి రూపాయలు ఇస్తామన్నా సరే నేను ప్రమోషన్స్‌కు రాను" అని అగ్రిమెంట్ సమయంలోనే ముఖం మీద చెప్పేయడం ఆమె స్టైల్. చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాలకు కూడా ప్రమోషన్స్ చేయని నయన్.. రీసెంట్‌గా మాత్రం తన రూట్ మార్చింది. ఎప్పుడూ లేనిది ఏకంగా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెరిసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అసలు ప్రమోషన్స్ అంటేనే చిరాకు పడే నయనతార ఎందుకు మారింది? యశ్ ఆమెను ఎలా ఒప్పించాడు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


[FEATURED_IMAGE]

సొంత సినిమాలకు ఒకలా.. బయటి సినిమాలకు మరోలా? 


సినిమా సైన్ చేసే ముందే 'నో ప్రమోషన్స్' కండిషన్ పెట్టే నయన్.. గతంలో 'శ్రీరామరాజ్యం' సినిమాకు మాత్రమే ప్రమోషన్స్ చేసింది. ఆ తర్వాత చిరంజీవి 'సైరా', 'గాడ్ ఫాదర్' లాంటి భారీ చిత్రాలకు కూడా ఆమె హాజరుకాలేదు. కానీ, ఇక్కడే నయన్ పై పెద్ద విమర్శ వచ్చింది. బయటి నిర్మాతలకు మొహం చాటేసిన నయన్.. తాను నిర్మాతగా మారి తీసిన 'కనెక్ట్' సినిమాకి మాత్రం ఊరూరా తిరిగి ప్రమోషన్స్ చేసింది.


అలాగే తన స్కిన్ కేర్ బ్రాండ్ బిజినెస్ కి సంబంధించి మలేషియా వెళ్లి మరీ ప్రెస్ మీట్స్ పెట్టింది. దీంతో నెటిజన్లు "మీరొక్కరే కాదు, బయటి నిర్మాతలు కూడా డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తున్నారు" అంటూ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


యశ్ ఫోన్ కాల్.. రూట్ మార్చిన లేడీ సూపర్ స్టార్! 


నెటిజన్ల విమర్శలు వర్కౌట్ అయ్యాయో, లేక నయన్ ఆలోచనా విధానం మారిందో కానీ.. ఇటీవల నయనతారలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. 'మన శంకర వరప్రసాద్' మూవీ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెతో రెండు ప్రమోషనల్ వీడియోలు చేయించాడు.


ఇక లేటెస్ట్‌గా 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె నేరుగా పాల్గొని ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా స్టార్ యశ్ స్వయంగా ఫోన్ చేసి అడగడంతో తాను కాదనలేకపోయానని ఆమె ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. తాను ప్రమోషన్స్ కి కావాలని డుమ్మా కొట్టనని, ఇలాంటి ఈవెంట్లలో తాను చురుగ్గా పాల్గొనలేననే భయంతోనే దూరంగా ఉంటానని అసలు రీజన్ బయటపెట్టింది.

ఇవి కూడా చదవండి (Also Read)
అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి: గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్? అమ్మ అనే పిలుపు కోసం ఎంతో పరితపించా.. తల్లి కాబోతున్న వేళ సమంత ఎమోషనల్! అనసూయపై బీజేపీ కేసు: 'జై శ్రీరామ్' వివాదంలో అసలు నిజాలు!

సొంత బిజినెస్‌లకు మాత్రమే వాల్యూ ఇస్తుందనే నెగిటివ్ మార్క్‌ను చెరిపేసుకోవడానికే నయన్ ఇప్పుడు బయటి సినిమాల ప్రమోషన్స్‌కు కూడా వస్తోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కారణం ఏదైనా.. కోట్లు ఇస్తామన్నా రాని నయన్, యశ్ అడగ్గానే రావడం కచ్చితంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీనే. అయితే ఆమెలోని ఈ మార్పు కేవలం 'టాక్సిక్' సినిమాకే పరిమితమా? లేక రాబోయే ప్రాజెక్ట్స్‌కి కూడా కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి. ఒకవేళ నయన్ కంటిన్యూగా ప్రమోషన్స్‌కు వస్తే మాత్రం నిర్మాతలకు పండగే!