[FEATURED_IMAGE]
ఫౌజీ ఇంటెన్స్ పోస్టర్: చరిత్ర చెప్పని కథ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్‌లో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం 'ఫౌజీ'. ఈ మూవీని డిసెంబరు 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ చిత్రబృందం ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను వదిలి అంచనాలను అమాంతం పెంచేసింది.
చార్మినార్ దగ్గర గాంధీజీ ఒకవైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. మరోవైపు ముఖం కనిపించకుండా, నెత్తురోడుతున్న దేహంతో ప్రభాస్ కనిపిస్తున్న తీరు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది.
ఏడేళ్ల తర్వాత ప్రభాస్ సంచలనం
"స్వాతంత్య్రం వచ్చాక అంతా సంబరాలు చేసుకున్నారు. కానీ దానికంటే ముందు ఒక పెద్ద యుద్ధమే జరిగింది. రేపటి కోసం పోరాడిన ప్రతి సైనికుడికి సెల్యూట్" అంటూ ఈ పోస్టర్‌కు జోడించిన క్యాప్షన్ సినిమా సోల్ ఏంటో చెబుతోంది.
ఇక సోషల్ మీడియాలో అసలు యాక్టివ్‌గా ఉండని ప్రభాస్, ఏకంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని మార్చారు. 'ఫౌజీ' పోస్టర్‌ను ఆయన తన ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
దీన్ని బట్టి ఈ పీరియాడికల్ యాక్షన్ లవ్ స్టోరీపై పాన్ ఇండియా స్టార్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతోంది.
సీతారామం డైరెక్టర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
'సీతారామం' లాంటి బ్లాక్‌బస్టర్ క్లాసిక్ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో దీనిపై విపరీతమైన బజ్ ఉంది.
ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ తనదైన శైలిలో అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
స్వతంత్ర పోరాట నేపథ్యం, మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ లవ్ స్టోరీలకు భారతీయ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఒకవైపు హను రాఘవపూడి కట్టిపడేసే ఎమోషనల్ టేకింగ్, మరోవైపు ప్రభాస్ మాస్ ఫాలోయింగ్.. ఈ రెండింటి కలయిక కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. ఏడేళ్ల తర్వాత ప్రభాస్ డీపీ మార్చడం చూస్తుంటే, ఆయన కెరీర్‌లో ఇది కేవలం మరో కమర్షియల్ హిట్ కాకుండా, జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకునే కల్ట్ క్లాసిక్ అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. డిసెంబర్ 3న బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం!


