50 కోట్లకు పైగా లాభం.. రవితేజ 'లాభాల వాటా' ఫార్ములా!
రవితేజ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. కానీ 'ఇరుముడి' సినిమాకు మాత్రం అడ్వాన్స్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఇండస్ట్రీలో టాక్. రెమ్యునరేషన్‌కు బదులుగా సినిమా లాభాల్లో వాటా తీసుకునేలా ఆయన ఒప్పందం చేసుకున్నారు. సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆయనకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
2022లో వచ్చిన 'ధమాకా' తర్వాత రవితేజకు సరైన హిట్ లేదు. గడిచిన నాలుగేళ్లలో వచ్చిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. కొన్ని సినిమాలైతే కనీసం 10 కోట్లు కూడా రాబట్టలేకపోయాయనే విశ్లేషణలు ఉన్నాయి. అయినా సరే తన పారితోషికాన్ని 20-25 కోట్ల రేంజ్‌లోనే మెయింటైన్ చేసిన రవితేజ.. ఇరుముడి కోసం మాత్రం నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా ప్రాఫిట్ షేరింగ్‌కు ఒప్పుకున్నారని సమాచారం.
135 కోట్ల కలెక్షన్స్.. నెక్స్ట్ సినిమాల లైనప్ ఇదే!
రవితేజ తీసుకున్న ఈ రిస్క్ ఇప్పుడు సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి వారంలోనే 135 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కెరీర్‌లోనే 100 కోట్ల మార్క్‌ను దాటిన భారీ చిత్రంగా 'ఇరుముడి' రికార్డు సృష్టించింది. ఈ సక్సెస్ కిక్‌తో ఆయన వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నారు. అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కూడా రీసెంట్‌గా కథా చర్చలు జరిగాయి.
ఒక సేఫ్ జోన్‌లో ఉండిపోయి ఫిక్స్‌డ్ ఆదాయం ఆశించడం కంటే, కష్ట కాలంలో రిస్క్ తీసుకుని 'లాభాల్లో వాటా' అడగడం గొప్ప బిజినెస్ స్ట్రాటజీ అనడానికి ఈ డీల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా ఫ్లాప్ అయితే చేతికి ఏమీ రాదనే రిస్క్ ఉన్నా.. హిట్ అయితే మాత్రం రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే డబుల్ అమౌంట్ ఇలా సొంతం చేసుకోవచ్చు. రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో టాలీవుడ్ టైర్-2 హీరోలందరికీ ఒక కొత్త బిజినెస్ మోడల్‌గా మారడం ఖాయం.

.webp)