ముఖం మీద తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు వంటివి చాలా మందికి వస్తుంటాయి. ఇవి ముఖం అందాన్ని తగ్గిస్తాయి. అయితే ఇలా వస్తే మహిళలు ఊరుకుంటారా? తెగ టెన్షన్ పడుతూ మార్కెట్‌లోని ఏవేవో ఉత్పత్తులు ఉపయోగిస్తారు. ఈ మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి అని మరికొందరు ఉల్లిరసాన్ని కూడా ముఖానికి అప్లై చేస్తుంటారు. అయితే, చర్మ సౌందర్యానికి ఉల్లి రసం వాడటం మంచిదేనా? చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఉల్లి రసం నేరుగా రాస్తే ప్రమాదమా?
చర్మం సున్నితంగా ఉన్న వారికి ఉల్లిరసం నేరుగా రాస్తే చర్మం మీద మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయి. దద్దుర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ సమస్యలే కాకుండా కంటి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖానికి ఉల్లి రసం నేరుగా పూయడం వల్ల స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అందుకే ముఖానికి నేరుగా ఉల్లిరసం రాయడం సరైనది కాదని అంటున్నారు.
ఉల్లి రసంతో కలిపి వాడితే ఫలితం ఉంటుందా?
అయితే, ఉల్లి రసంలో కొన్ని రకాల పదార్థాలను కలిపి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఉల్లిపాయ రసంలో నిమ్మరసం లేదా పెరుగు మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలని సూచిస్తున్నారు. ఇలా అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇది మీ చర్మం అందంగా మరియు కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. అయితే, ఈ ప్యాక్‌ను ఉపయోగించే ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రతిచర్య ఉంటే వెంటనే ముఖానికి వాడటం మానేయాలని వారు సూచిస్తున్నారు.
0 కామెంట్‌లు