Operation Sindoor | ‘ఆపరేషన్ సిందూర్‌’: పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు!

operation sindoor

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరుతో ఏకంగా తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అంతర్జాతీయ సమాజానికి సమాచారం

భారత ఉన్నతాధికారులు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసిన విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశారు. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు భారత్ సమాచారం అందించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాక్, ట్రంప్ స్పందన

భారత్ తమ దేశంపై దాడులు చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఒక లేఖ విడుదల చేశారు. పాక్, భారత్ సరిహద్దులకు సమీపంలోని బహవల్పూర్, కొట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని పాక్ ప్రకటించినప్పటికీ, పదికి పైగా చనిపోయి ఉంటారని తెలుస్తోంది. సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని పాక్ ఆర్మీ తెలిపింది. ఈ దాడికి పాల్పడిన భారత్‌పై తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రకటించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ దాడులపై స్పందించారు.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ట్రంప్ సూచించారు. ఇది ఒక హేయమైన చర్య అని, రెండు శక్తివంతమైన దేశాలు ఘర్షణ పడటం ప్రపంచానికి మంచిది కాదని ఆయన అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు