సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అవ్వడం సాధారణ విషయమే. తాజాగా ఒకప్పటి టాప్ యాంకర్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన ఉన్న అందాల రాశిని గుర్తుపట్టారా? ఒకప్పుడు టెలివిజన్‌ను తన మాటలతో ఊపేసింది. యాంకర్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టారా? అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఈమె యాంకర్‌గా స్టార్‌డమ్ అందుకుంది. కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఆమె స్టేజ్‌పై నిలబడితే ప్రేక్షకులకు తెలియని ఆనందం వస్తుంది, కుర్రాళ్ల ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఆమె ఎవరో కాదు.. ఉదయభాను.
ఉదయభాను: బుల్లితెర అతిలోక సుందరి
ఒకప్పుడు బుల్లితెరను తన అందం, మాటలు మరియు చలాకీతనంతో ఉదయభాను ఏలారు. ఆమెను అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. ప్రముఖ ఛానల్‌లో ప్రసారమైన "హృదయాంజలి" అనే కార్యక్రమంతో ఆమె ప్రేక్షకులను పలకరించారు. యాంకర్‌గా చేసిన మొదటి కార్యక్రమంతోనే తన గలగల మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు.
పాపులర్ షోల యాంకర్‌గా ఉదయభాను:
యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఉదయభాను అనేక పాపులర్ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. "వన్స్ మోర్ ప్లీజ్", "సాహసం చేయరా డింబకా", "డ్యాన్స్ బేబీ డ్యాన్స్", "రేలారే రే రేలా", "ఢీ" రియాలిటీ డ్యాన్స్ షో, "జాణవులే నెరజాణవులే", "పిల్లలు పిడుగులు" వంటి ఎన్నో విజయవంతమైన షోలకు ఆమె యాంకర్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించారు.
సినిమాల్లోనూ మెరిసిన ఉదయభాను:
ఉదయభాను కేవలం యాంకర్‌గానే కాకుండా సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆమె 10వ తరగతి చదువుతుండగా మొదటి సినిమా "ఎర్ర సైన్యం"లో నటించారు. తెలుగుతో పాటు తమిళ మరియు కన్నడ సినిమాల్లో కూడా ఆమె నటించారు. అంతేకాకుండా, కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెరిసి మెప్పించారు.
పెళ్లి తర్వాత తెరపై కనిపించని ఉదయభాను:
పెళ్లి తర్వాత ఉదయభాను బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. అయితే, ప్రస్తుతం ఆమె "త్రిబాణధారి బార్బరిక్" అనే సినిమాలో నటిస్తున్నారు. మళ్లీ ఆమె వెండితెరపై సందడి చేయనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.