కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోగా ఎదుగుతున్న నటుడు ప్రియదర్శి. "పెళ్లి చూపులు" సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో కమెడియన్‌గా నటించి, హీరోగా మారి పలు చిత్రాల్లో మెప్పించాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన "బలగం" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ప్రియదర్శి క్రేజ్ పూర్తిగా మారిపోయింది. తన నటనతో సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. "బలగం" తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల నాని నిర్మాతగా వ్యవహరించిన "కోర్ట్" సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. థియేటర్స్‌లో మంచి స్పందన లభించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రియదర్శి "సారంగపాణి జాతకం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
"మిఠాయి" నా కెరీర్‌లోని చెత్త సినిమా
ఇదిలా ఉండగా, ప్రియదర్శి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్‌లో "మిఠాయి" సినిమా ఒక చెత్త సినిమా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సినిమా చేసి తాను తప్పు చేశానని, ఆ సినిమాను తాను మనస్ఫూర్తిగా అంగీకరించలేదని అన్నారు. దర్శకుడు కూడా ఆ సినిమాను అంత ఆసక్తిగా చేయలేదని తెలిపారు. "మిఠాయి" చిత్రం తన కెరీర్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని ఒక పాఠం నేర్పిందని, దాని ద్వారా తనకు ఒక స్పష్టత వచ్చిందని చెప్పారు.
"కోర్ట్" నా కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం
ప్రియదర్శి తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా "కోర్ట్" సినిమాను అభివర్ణించారు. తన 9 ఏళ్ల కెరీర్‌లో తాను తీసుకున్న మంచి నిర్ణయాలలో "కోర్ట్" సినిమాను అంగీకరించడం ఒకటని ఆయన పేర్కొన్నారు.