అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలలో ముఖ్యులు. ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తూ వీరు మెగా మరియు నందమూరి కుటుంబాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారు. వీరికి అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ గుర్తింపు
పుష్ప మరియు పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలాగే ఆర్ఆర్ఆర్ మరియు దేవర సినిమాలతో ఎన్టీఆర్‌కు అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చేజారిన బ్లాక్‌బస్టర్ మూవీ
అయితే ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలో ఒక బ్లాక్‌బస్టర్ సినిమాను తమ చేతులతో వదులుకున్నారు. చివరికి ఆ సినిమా మరో హీరో దగ్గరికి వెళ్లి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది మరియు ఆ హీరోకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తుంటే చాలా మంది చూడటానికి ఇష్టపడతారు.
20 ఏళ్లు పూర్తి చేసుకున్న భద్ర
ఆ బ్లాక్‌బస్టర్ మూవీ మరేదో కాదు, మాస్ మహారాజా రవితేజ నటించిన భద్ర. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, మీరాజాస్మిన్ హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2005 మే 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడానికి కారణాలు
అయితే ఈ సినిమా మొదట అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్‌లకు ఆఫర్ చేశారట. అల్లు అర్జున్ ఆ సమయంలో ఆర్య సినిమాకు కమిట్మెంట్ ఉండటం వల్ల భద్ర సినిమాను వదులుకున్నాడు. ఆ తర్వాత ఈ కథ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లగా, కొన్ని కారణాల వల్ల ఆయన కూడా రిజెక్ట్ చేశాడట. ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశానో అని ఎన్టీఆర్ ఇప్పటికీ బాధపడుతుంటాడని సమాచారం.