Coriander benefits | కొత్తిమీర కేవలం రుచి కోసమేనా? దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

naveen
By -
0

ఏ కూర వండినా చివరలో కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. కొత్తిమీరను చిన్నగా కోసి, కర్రీపై చల్లితే అది అందంగా కనిపిస్తుంది. కేవలం కూర అందంగా కనిపించడానికి, రుచి కోసం మాత్రమే కొత్తిమీరను వాడతారని అనుకుంటే పొరపాటే. ప్రతిరోజు కొత్తిమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు హైబీపీ, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కొత్తిమీర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం.

కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

రక్తపోటు, మధుమేహం నియంత్రణ: అధిక రక్తపోటు క్రమంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. కొత్తిమీర తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలోనూ ఇది దోహదపడుతుంది.

యాంటీఆక్సిడెంట్ రక్షణ: కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీర కణాలను కాపాడతాయి. కొత్తిమీరలో ఎలోమోల్, కాంఫర్, బొర్నెవోల్, కార్వోన్, క్వుర్సేటిన్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి దెబ్బతీయకుండా కాపాడతాయి.

గుండె ఆరోగ్యం & కొలెస్ట్రాల్ నియంత్రణ: కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు (LDL) ను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు (HDL) ను పెంచుతాయి. అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడం వల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

మెదడు ఆరోగ్యం & నాడీ వ్యవస్థ రక్షణ: వయసు పెరుగుతున్న కొద్దీ పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి వ్యాధులు మెదడు పనితీరును దెబ్బతీస్తుంటాయి. అయితే, కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు ఆందోళన (యాంగ్జైటీ) ను తగ్గిస్తాయి. అలాగే, నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల: కొత్తిమీరను ప్రతిరోజూ తినడం వల్ల పేగులు శుభ్రమవుతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు కొత్తిమీరను రోజూ తినడం మంచిది.

ఇన్ఫెక్షన్ల నివారణ: కొత్తిమీరలో యాంటీమైక్రోబియల్ కాంపౌండ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహార కల్తీ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కొత్తిమీరలోని డోడెసెనాల్ అనే పదార్థం బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ నుంచి మనల్ని రక్షిస్తుంది.

చర్మ సంరక్షణ: చర్మంపై దద్దుర్లు, మొటిమలు, గాయాల మచ్చల నివారణకు కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు ఎంతో మేలు చేస్తాయి. కణాల డ్యామేజీని తగ్గిస్తాయి. ముఖ్యంగా పిల్లల చర్మ సంరక్షణలో కొత్తిమీర ఎంతో కీలకం.

కంటి ఆరోగ్యం: కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్ దృష్టి లోపాలను నియంత్రిస్తాయి. కంటి మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి కొత్తిమీర తినడం వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ఎముకల బలం: కొత్తిమీరలో ఉండే కాల్షియం మరియు ఇతర మినరల్స్ ఎముకలను బలంగా చేస్తాయి. బోన్ రీగ్రోత్‌కు (ఎముకల పునరుత్పత్తికి) దోహదపడతాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!