మీ ఆధార్ కార్డు ఇకపై పాత కార్డు లా ఉండదు.. అడ్రస్, పుట్టిన తేదీ ఏవీ కనిపించవు! కేంద్రం తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు.
![]() |
| A conceptual image showing a new Aadhaar card format |
దేశంలో ప్రతి పౌరుడికి ప్రామాణికమైన గుర్తింపు కార్డు ఆధార్. అయితే, త్వరలోనే ఈ కార్డు రూపం పూర్తిగా మారిపోబోతోంది. ఇకపై ఆధార్ కార్డు మీద మీ చిరునామా, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాలు ముద్రించి ఉండకపోవచ్చు. కేవలం మీ ఫోటో, ఒక క్యూఆర్ (QR) కోడ్ మాత్రమే కనిపించేలా కొత్త విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, UIDAI (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) సన్నాహాలు చేస్తున్నాయి.
ఎందుకీ మార్పులు?
పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతే ఈ మార్పులకు ప్రధాన కారణమని UIDAI సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కార్డుపై అన్నీ స్పష్టంగా ముద్రించి ఉండటంతో, ప్రజలు దాన్ని ఎక్కడ పడితే అక్కడ జిరాక్స్ తీసి ఇచ్చేస్తున్నారు. హోటల్స్, సిమ్ కార్డులు, ఈవెంట్లకు ఇలా విచ్చలవిడిగా జిరాక్సులు ఇవ్వడం వల్ల సున్నితమైన డేటా దుర్వినియోగం అవుతోంది. అందుకే, ఇకపై వివరాలను ముద్రించడానికి బదులుగా, వాటిని QR కోడ్‌లో డిజిటల్‌గా దాచాలని నిర్ణయించారు. అంటే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్, ఈ "జిరాక్సుల సంస్కృతి"కి ముగింపు పలకడమే దీని లక్ష్యం.
కేవలం కార్డు మాత్రమే కాదు, ఆధార్ యాప్ కూడా పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతమున్న mAadhaar స్థానంలో, కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి (DPDP Act) అనుగుణంగా సరికొత్త యాప్‌ను రాబోయే 18 నెలల్లో తీసుకురానున్నారు. ఇందులో ఇంటి నుంచే అడ్రస్ మార్చుకోవడం, సొంత మొబైల్ లేని కుటుంబ సభ్యులను కూడా యాప్‌లో యాడ్ చేసుకోవడం వంటి హైటెక్ ఫీచర్లు ఉండనున్నాయి.

