అసలు హీరోయిన్ అవుతానని కలలో కూడా అనుకోలేదట.. కానీ చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయాయి! కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న అనుపమ పరమేశ్వరన్ మనసులో మాట ఇదే.
ఈ ఏడాది డ్రాగన్, కిష్కింధ పురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ లాంటి ఐదుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్, తన సినీ ప్రయాణంలో అప్పుడే ఒక మైలురాయిని దాటేసింది. తాజాగా ఆమె చిత్ర పరిశ్రమలో 10 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు, నేర్చుకున్న పాఠాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది.
భయం నుంచి బలం వరకు..
"నిన్ననే ఇండస్ట్రీకి వచ్చినట్లు అనిపిస్తోంది, కానీ అప్పుడే 10 ఏళ్లు గడిచిపోయాయి. ఈ ప్రయాణం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది" అని అనుపమ ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ గురించి ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే:
అనుకోని మలుపు: అసలు తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదట.
భయం పోయింది: కెరీర్ మొదట్లో చాలా భయపడేదాన్ని అని, కానీ ఈ ప్రయాణం తనను తాను నమ్ముకోవడం, బలంగా నిలబడడం నేర్పిందని చెప్పింది.
తెలుగువారి ప్రేమ: 2016లో 'అ..ఆ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేనిదని, అందుకే తెలుగు ఆడియన్స్ తనకు ఎప్పటికీ స్పెషల్ అని గుర్తుచేసుకుంది.
ఆ ట్యాగ్స్ అనవసరం!
ఇటీవల సినిమాల్లో వినిపిస్తున్న "ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్" అనే పదాల గురించి కూడా అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ అనవసరమైన ట్యాగ్స్ అని కొట్టిపారేసింది. తన తొలి సినిమా 'ప్రేమమ్'లో తను, సాయిపల్లవి, మడోన్నా.. అందరి పాత్రలు కథకు ఎంత ముఖ్యమో గుర్తుచేసింది. "స్క్రీన్ టైమ్ కంటే.. ఆ పాత్రకు ఉన్న బలం (Weight) ముఖ్యం" అని క్లియర్‌గా చెప్పుకొచ్చింది.

