మాస్ మసాలా సినిమాలు దెబ్బ కొట్టడంతో రామ్ పోతినేని రూట్ మార్చాడు. మళ్లీ తన పాత వింటేజ్ లుక్‌తో.. హిట్ కోసం గట్టిగానే వస్తున్నాడు!
ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ పోతినేని, తన జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్‌ని పక్కనపెట్టి 'ఇస్మార్ట్ శంకర్'తో ఊర మాస్ అవతార్‌లోకి మారిపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో, రామ్ ఇప్పుడు యు-టర్న్ తీసుకున్నాడు. మళ్లీ తన ఓల్డ్, వింటేజ్ లుక్‌తో 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాతో నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విశేషం ఏంటంటే, ఈ సినిమాతో రామ్ కేవలం నటుడిగానే కాదు, రైటర్‌గా, సింగర్‌గా తనలోని దాగి ఉన్న కొత్త టాలెంట్‌ను కూడా పరిచయం చేస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్లకు గుడ్ బై.. కంటెంట్ డైరెక్టర్‌కు వెల్కమ్!
గత 4 ఏళ్లుగా హిట్ కోసం రామ్ ఎదురుచూస్తూనే ఉన్నాడు. లింగుస్వామి, బోయపాటి శ్రీను, పూరీ జగన్నాథ్ వంటి బడా డైరెక్టర్లతో సినిమాలు చేసినా ఫలితం దక్కలేదు. అందుకే ఈసారి స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, కంటెంట్‌ను నమ్ముకున్నాడు.
ఈ సినిమా విశేషాలు ఇవే:
డైరెక్టర్: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో తన టాలెంట్ నిరూపించుకున్న మహేష్ బాబు పి.
హీరోయిన్: ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ లేని భాగ్యశ్రీ బోర్సే.
స్పెషల్ అట్రాక్షన్: కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కన్నడ మార్కెట్‌పై కన్ను!
ఉపేంద్ర ఈ ప్రాజెక్టులో ఉండటంతో, రామ్ కన్నడ మార్కెట్‌పై కూడా గట్టిగా ఫోకస్ పెట్టాడు. రీసెంట్‌గా బెంగళూరులో జరిగిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో తనకున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి రామ్ తెగ సంబరపడిపోయాడు. దీంతో ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు శాండిల్ వుడ్‌లోనూ హిట్ చేయాల్సిన బాధ్యత రామ్‌పై పడింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి నవంబర్ 27న 'ర్యాపో' ఫ్యాన్స్ పండగ చేసుకుంటారో లేదో చూడాలి.

