'కాంత' సినిమాకు, 70 ఏళ్లనాటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ 'మాయాబజార్'కు ఒక సంబంధం ఉంది! ఈ షాకింగ్ సీక్రెట్‌ను ఆ చిత్ర నిర్మాత, నటుడు రానా దగ్గుబాటి స్వయంగా రివీల్ చేశారు.
'కాంత' కోసం.. 'మాయాబజార్' కెమెరా!
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడికల్ డ్రామా 'కాంత'. 1940-50ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా, మరో రెండు రోజుల్లో (నవంబర్ 14న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో, సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని రానా దగ్గుబాటి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
రానా చెప్పిన కెమెరా సీక్రెట్
'కాంత' సినిమా పీరియడ్ ఫీల్ కోసం పాత కెమెరాలను వాడాల్సిన అవసరం వచ్చిందని, అందుకే 1957 నాటి 'మాయాబజార్', 'పాతాళ భైరవి' వంటి క్లాసిక్స్‌ను చిత్రీకరించిన "మిచెల్ కెమెరా" (Mitchell Camera) ను ఈ సినిమా కోసం ఉపయోగించామని రానా వెల్లడించారు. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు.
70 ఏళ్ల కిందట వాడిన ఆ కెమెరా ఇప్పుడు వీరికి ఎలా దొరికిందనే విషయాన్ని కూడా రానా తెలిపారు. రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, కొన్నేళ్ల క్రితం ఆ కెమెరాను వాహిని స్టూడియోస్ నుండి తీసుకున్నారట. ఇప్పుడు 'కాంత' కోసం రానా దాన్ని బయటకు తీశారు. అంతేకాదు, ఆ కెమెరాతో తీసిన ఒక షాట్‌ను ట్రైలర్‌లో కూడా యాడ్ చేశామని రానా రివీల్ చేశారు.
మొత్తం మీద, ఈ వార్త 'కాంత' సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 'లక్కీ భాస్కర్' వంటి హిట్ తర్వాత దుల్కర్ నటిస్తున్న ఈ చిత్రం, 70 ఏళ్లనాటి లెజెండరీ కెమెరాతో చిత్రీకరించిన ఆ సన్నివేశాలతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

