ఆమిర్ ఖాన్ వెనక్కి తగ్గడంతో, ఎన్టీఆర్‌కు జాక్‌పాట్ తగిలిందా? ఇండియన్ సినిమా పితామహుడి బయోపిక్ కోసం ఇద్దరు స్టార్ డైరెక్టర్లు పోటీ పడగా, ఇప్పుడు జక్కన్నకు దారి క్లియర్ అయినట్లే!
RRR కాంబోలో 'ఫాల్కే' బయోపిక్.. హోల్డ్‌లో ఎందుకు?
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 'స్టూడెంట్ నంబర్ 1' నుండి 'RRR' వరకు, వీరి కలయికలో వచ్చిన ప్రతీ సినిమా బ్లాక్‌బస్టరే. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రానుందని, రాజమౌళి నిర్మించనున్న 'మేడ్ ఇన్ ఇండియా' (దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్)లో ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషిస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది.
ఈ వార్తను ఇరువర్గాలు ఖండించకపోవడంతో ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ, ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్ (డ్రాగన్, దేవర 2) కారణంగా ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్‌లో పడినట్లు వార్తలు వచ్చాయి.
ఆమిర్ ఖాన్, హిరాణీ ప్రాజెక్ట్.. అనూహ్యంగా వాయిదా!
అదే సమయంలో, బాలీవుడ్‌లోనూ ఫాల్కే బయోపిక్‌పై చర్చ మొదలైంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌తో ఇదే కథను తీస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఒకే అంశంపై రెండు భారీ సినిమాలు వస్తే, పోలికలు తప్పవని అందరూ భావించారు.
అయితే, ఇప్పుడు ఆమిర్-హిరాణీ ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఆమిర్ ఖాన్ కొన్ని మార్పులు కోరగా, అందుకు మేకర్స్ సిద్ధంగా లేరని, అందుకే ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం.
ఎన్టీఆర్‌కు లైన్ క్లియర్.. ఇక దర్జాగా!
బాలీవుడ్ ప్రాజెక్ట్ వాయిదా పడటం, రాజమౌళి-ఎన్టీఆర్ ప్రాజెక్టుకు అతిపెద్ద అడ్డంకి తొలగిపోయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒకే అంశంపై రెండు సినిమాలు వస్తే, ఏది ముందు వచ్చినా, రెండోదానిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఆ పోటీ లేకపోవడంతో, రాజమౌళి దర్జాగా ఎన్టీఆర్‌తో ఈ బయోపిక్‌ను పట్టాలెక్కించవచ్చు.
మొత్తం మీద, ఆమిర్ ఖాన్ ప్రాజెక్ట్ ఆగిపోవడం 'మేడ్ ఇన్ ఇండియా'కు కలిసొచ్చే అంశం. మరి రాజమౌళి, ఎన్టీఆర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో, ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తారో వేచి చూడాలి.

