'గర్ల్‌ఫ్రెండ్' చున్నీ వివాదం | నిర్మాత SKN క్లారిటీ

moksha
By -
0

 సినిమా చూసి థియేటర్లో చున్నీ తీసేసిన యువతి.. ఎందుకో తెలుసా? ఆ తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు!


'గర్ల్‌ఫ్రెండ్' చున్నీ వివాదం | నిర్మాత SKN క్లారిటీ


అసలేం జరిగింది?

రష్మిక మందన్న లీడ్ రోల్‌లో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాకు యూత్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ థియేటర్‌కు వెళ్లారు. సినిమా పూర్తయ్యాక, ఓ యువతి మాట్లాడుతూ.. సినిమా తనకు బాగా నచ్చిందని, అందులోని పెయిన్ తాను ఫీల్ అయ్యానని చెబుతూ, "ఇలాంటి సినిమా చూశాక, ధైర్యంగా ఉన్నాను" అని చెప్పి, తన చున్నీ తీసేసింది. ఆ ధైర్యానికి మెచ్చుకున్న దర్శకుడు, ఆ యువతిని హత్తుకున్నారు.


చున్నీ తీయడమే ఎంపవర్‌మెంటా? నెటిజన్ల ఫైర్

అయితే, ఈ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చిన్నపాటి వివాదం మొదలైంది. "ఉమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఒంటి మీద ఉన్న చున్నీ తీసివేయడం కాదు," అంటూ కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. చున్నీ తీయడాన్ని ధైర్యంగా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని, మేకర్స్ ఆ వీడియోను పోస్ట్ చేయడం తప్పు అంటూ తప్పుపట్టారు.


"మా ఉద్దేశం అది కాదు": నిర్మాత SKN క్లారిటీ

ట్రోల్స్ ఎక్కువ అవుతుండటంతో, ఈ వివాదంపై నిర్మాత ఎస్కేఎన్ (SKN) సక్సెస్ మీట్‌లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "సినిమా ద్వారా తాము చెప్పాలనుకున్నది భయాన్ని పోగొట్టమని మాత్రమే, అంతే గానీ చున్నీలు తీసేయమని కాదు. ఆ సీన్ ఉద్దేశం మహిళలు తమలోని భయాన్ని తొలగించుకోవడం గురించి మాత్రమే. దయచేసి ఆ విషయంలో వేరే కోణంలో చూడడం సరైనది కాదు," అంటూ ఎస్కేఎన్ వివరణ ఇచ్చారు.


మొత్తం మీద, ఈ చిన్నపాటి వివాదానికి నిర్మాత ఎస్కేఎన్ తన వివరణతో తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టారు.


Tags:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!