నెలకు లక్షల జీతం.. చేతిలో వైట్ కాలర్ జాబ్. కానీ అదంతా వదిలేసి ఓ వ్యక్తి డెలివరీ బాయ్‌గా మారాడు! ఎందుకో తెలిస్తే అతనికి సలామ్ కొట్టాల్సిందే.
![]() |
| AI Generated Image |
బెంగళూరులో ఓ టెక్కీ తన కెరీర్ విషయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏటా రూ. 25 లక్షల ప్యాకేజీ (LPA) ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని కాలదన్నుకుని, అతను ఫుడ్ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. త్వరలో పెళ్లి, కొత్తగా కొన్న కారు, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఈ రిస్క్ తీసుకోవడం చూసి అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్ అయ్యారు. కొందరు మిత్రులైతే ఎగతాళి కూడా చేశారు.
ఏసీ గది వదిలి.. రోడ్డుపైకి ఎందుకు?
అయితే, అతను డెలివరీ బాయ్‌గా మారింది డబ్బుల కోసం కాదు, ఒక పక్కా బిజినెస్ ప్లాన్‌తో! సొంతంగా 'క్లౌడ్ కిచెన్' (Cloud Kitchen) ప్రారంభించాలనేది అతని కల. ఆఫీసులో కూర్చుని డేటా చూడటం కంటే, గ్రౌండ్ లెవల్‌లో మార్కెట్ ఎలా ఉందో స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు.
అందుకే బ్యాగ్ తగిలించుకుని, రోడ్లపై తిరుగుతూ ఈ విషయాలపై నిశితంగా పరిశోధన చేస్తున్నాడు:
జనాలు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న మెనూ ఐటెమ్స్ ఏంటి?
ఏ ప్రాంతాల్లో, ఏ టైమ్‌లో ఫుడ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది?
కస్టమర్లు ఏ ధరలకు (Pricing) ఓకే చెబుతున్నారు?
వాచ్‌మెన్లతో తిట్లు తింటూ..
డెలివరీ బాయ్‌గా అపార్ట్‌మెంట్లకి వెళ్తే వాచ్‌మెన్లు తనపై అరుస్తున్నారని, అనేక అవమానాలు ఎదురవుతున్నాయని అతను తన స్నేహితుడితో వాపోయాడు. అయినా సరే, వ్యాపారంలో గెలవాలనే పట్టుదల ముందు ఇవేవీ పెద్దవి కావని భావిస్తున్నాడు.
తన అనుభవంతో తక్కువ ధరకే ఎక్కువ అమ్ముడుపోయే 12 రకాల ఐటెమ్స్‌ను (SKUs) అతను ఇప్పటికే గుర్తించాడు. ఈ గ్రౌండ్ వర్క్‌తో కేవలం 3-4 నెలల్లోనే తన బిజినెస్‌లో లాభాలు చూస్తానని ధీమాగా ఉన్నాడు. ఈ స్టోరీని 'ఎంజీవీ' అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ షేర్ చేయడంతో, నెటిజన్లు ఆ యువకుడి డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.

