మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో రష్మిక అరంగేట్రం చేసిన 'థామా' సినిమా ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసింది! కానీ, ఇప్పుడే చూడాలంటే జేబులో చేయి పెట్టాల్సిందే.
అమెజాన్ ప్రైమ్‌లో 'థామా'.. కానీ కండిషన్స్ అప్లై! దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన 'థామా' (Thama), ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే, ఒక చిన్న మెలిక ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం 'రెంట్' (అద్దె) పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే, ఈ సినిమాను ఇప్పుడే చూడాలంటే రూ. 349 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అంత డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే, కొద్ది రోజులు ఆగితే సరిపోతుంది. డిసెంబర్ 16, 2025 నుండి ఈ సినిమా ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరికీ ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది.
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ వంటి భారీ తారాగణం ఉంది. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు సచిన్-జిగర్ సంగీతం అందించారు.

