విశాఖ నేవీ గూఢచర్యం కేసు: మరో ఇద్దరికి జైలు శిక్ష!

naveen
By -

దేశ రక్షణ వ్యవస్థలో పెను సంచలనం సృష్టించిన 'విశాఖపట్నం నేవీ గూఢచర్యం' (Vizag Navy Espionage) కేసులో మరో కీలక తీర్పు వెలువడింది. దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసిన ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చిన ఎన్ఐఏ (NIA) ప్రత్యేక కోర్టు.. వారికి జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది.


NIA court hammer and Indian Navy representative image regarding espionage case verdict


ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన సోమనాథ్ సంజయ్ ఇకాడే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోను కుమార్‌లను దోషులుగా కోర్టు నిర్ధారించింది. సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ ఏజెంట్లతో చేతులు కలిపి, భారత నౌకాదళానికి చెందిన అత్యంత కీలకమైన సమాచారాన్ని వీరు లీక్ చేసినట్లు రుజువైంది.


ఆరు నేశాల జైలు.. రూ. 5 వేల జరిమానా

దేశద్రోహానికి పాల్పడిన వీరిద్దరికీ కోర్టు కఠిన శిక్ష ఖరారు చేసింది.

  • శిక్ష వివరాలు: యూఏ(పీ)ఏ చట్టం, అధికారిక రహస్యాల చట్టం కింద.. ఇద్దరికీ వేర్వేరుగా 5 ఏళ్ల 11 నెలల 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.

  • జరిమానా: ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది. ఒకవేళ కట్టకపోతే అదనంగా మరో ఏడాది జైలులో ఉండాల్సి వస్తుంది.


ఇప్పటివరకు 10 మందికి శిక్ష!

2019 డిసెంబర్‌లో వెలుగుచూసిన ఈ కుట్రలో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజా తీర్పుతో కలిపి ఈ కేసులో శిక్ష పడిన వారి సంఖ్య 10కి చేరింది. ఇంకా మరో ఐదుగురు నిందితులపై విచారణ సాగుతోంది. 2019లో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి ఈ కేసును ఎన్ఐఏ స్వీకరించింది.