చైనా కవ్వింపులు: షక్స్‌గామ్ లోయ మాదే! భారత్ సీరియస్ వార్నింగ్

naveen
By -
చైనా మరో దుస్సాహసం.. ఆ భారత భూభాగం మాదేనంటూ కవ్వింపులు!

చైనా మరో దుస్సాహసం.. ఆ భారత భూభాగం మాదేనంటూ కవ్వింపులు! కేంద్రం సీరియస్ వార్నింగ్.


భారత సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చైనా మళ్లీ విషం చిమ్ముతోంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మొన్నటిదాకా రచ్చ చేసిన చైనా.. ఇప్పుడు ఏకంగా "కాశ్మీర్‌లోని ఆ ముక్క మాదే.. అక్కడ మా ఇష్టం వచ్చినట్లు రోడ్లు వేసుకుంటాం" అంటూ తెగేసి చెబుతోంది. అసలు చైనా కన్నేసిన ఆ ప్రాంతం ఏది? భారత్ ఎందుకు అంత సీరియస్ అవుతోంది? 


షక్స్‌గామ్ లోయపై చైనా కన్ను: 

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పరిధిలోని 'షక్స్‌గామ్ లోయ' (Shaksgam Valley) పూర్తిగా తమదేనని చైనా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, అక్కడ తాము చేపడుతున్న రోడ్లు, ఇతర నిర్మాణ పనులు తమ సార్వభౌమ హక్కు అని, ఇందులో భారత్ జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని చైనా అధికార ప్రతినిధి మావో నింగ్ (Mao Ning) వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో మంట పుట్టిస్తోంది.


పాకిస్థాన్ చేసిన చారిత్రక తప్పు: 

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. 1947లో పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగంలో ఈ షక్స్‌గామ్ లోయ ఉంది. అయితే, భారత్‌పై పగతో పాకిస్థాన్ 1963లో ఒక ఒప్పందం ద్వారా దాదాపు 5,180 చదరపు కిలోమీటర్ల ఈ భారత భూభాగాన్ని చైనాకు "గిఫ్ట్"గా రాసిచ్చేసింది. అప్పటి నుంచి చైనా అక్కడ తిష్ట వేసింది. ఇప్పుడు అక్కడ భారీ ఎత్తున రోడ్లు వేస్తూ భారత్‌కు సవాల్ విసురుతోంది.


భారత్ స్ట్రాంగ్ వార్నింగ్: 

చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ (MEA) ఘాటుగా స్పందించింది. "షక్స్‌గామ్ లోయ అనేది భారత్‌లో అంతర్భాగం. 1963లో పాకిస్థాన్-చైనా మధ్య జరిగిన ఒప్పందాన్ని మేము ఎప్పుడూ గుర్తించలేదు. అది చట్టవిరుద్ధం. మా భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేస్తే చూస్తూ ఊరుకోం. మా ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఏ చర్యలైనా తీసుకుంటాం" అని స్పష్టం చేసింది.


బాటమ్ లైన్ : 

ఇది కేవలం ఒక భూభాగం గొడవ మాత్రమే కాదు.. అంతకు మించి!

  • స్ట్రాటజిక్ ముప్పు: షక్స్‌గామ్ లోయ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం 'సియాచిన్' గ్లేసియర్‌కు దగ్గరగా ఉంటుంది. అక్కడ చైనా పట్టు సాధిస్తే.. మన సైన్యానికి అది అతిపెద్ద తలనొప్పిగా మారుతుంది.

  • రెండు వైపులా ప్రమాదం: పాకిస్థాన్, చైనా కలిసి ఆ ప్రాంతంలో సీపీఈసీ (CPEC) పేరుతో రోడ్లు వేయడం అంటే.. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారత్‌ను రెండు వైపుల నుంచి చుట్టుముట్టే ప్లాన్ ఇది. అందుకే భారత్ ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటోంది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!