రష్యాను వదిలేయండి.. వెనిజులా ఆయిల్ తీసుకోండి! భారత్‌కు ట్రంప్ బంపర్ ఆఫర్.. అసలు స్కెచ్ ఇదే!
"రష్యా ఆయిల్ కొంటే ఊరుకోం" అని నిన్నటి దాకా పన్నుల హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు భారత్‌కు ఒక కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చారు. "రష్యా ఆయిల్ మానేయండి.. కావాలంటే వెనిజులా ఆయిల్ మేమే ఇస్తాం" అంటూరి కొత్త ప్రతిపాదన తెచ్చారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి, ఆ దేశ చమురు నిల్వలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అమెరికా వేస్తున్న వ్యూహాత్మక అడుగు ఇది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న భారత్‌ను.. ఆ వైపు నుంచి మళ్లించడమే లక్ష్యంగా ట్రంప్ ఈ 'మాస్టర్ ప్లాన్' రచించారు.
ఇటీవలే వెనిజులా నుంచి సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన (30-50 మిలియన్ బ్యారెళ్లు) చమురును అమెరికాకు ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ ఆయిల్‌ను భారత్‌కు విక్రయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ వ్యాపారం పాత పద్ధతిలో నేరుగా వెనిజులా-భారత్ మధ్య జరగదు. ఇది పూర్తిగా "అమెరికా పర్యవేక్షణలో" (US-Controlled Framework) జరుగుతుంది. అంటే వెనిజులా ఆయిల్‌ను మార్కెటింగ్ చేసేది, డబ్బులు వసూలు చేసేది అమెరికా ప్రభుత్వమే.
అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ ఈ విషయాన్ని ధృవీకరించారు. వెనిజులా ఆయిల్ ప్రవాహానికి అడ్డు లేదని, కానీ అది అమెరికా డిజైన్ చేసిన సిస్టమ్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. "ఆయిల్ అమ్మగా వచ్చిన డబ్బు నేరుగా వెనిజులా పాలకుల చేతికి వెళ్లదు. అది ఒక ప్రత్యేక ఖాతాలోకి వస్తుంది. ఆ డబ్బును వెనిజులా ప్రజల అవసరాలకు మాత్రమే వాడేలా చూస్తాం. అవినీతికి, అక్రమాలకు తావులేకుండా చేస్తాం" అని ఆయన వివరించారు. గతంలో అమెరికా ఆంక్షలు విధించక ముందు.. వెనిజులా ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ ఒకటి. మన దేశంలోని రిఫైనరీలు వెనిజులాలో దొరికే 'హెవీ క్రూడ్ ఆయిల్'ను శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆఫర్ భారత్‌కు కలిసొచ్చే అంశమే.
బాటమ్ లైన్..
ట్రంప్ ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని చూస్తున్నారు.
రష్యాకు చెక్: భారత్ గనక వెనిజులా వైపు మళ్లితే.. రష్యా ఆయిల్ ఆదాయానికి గండి పడుతుంది. పుతిన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ట్రంప్ వాడుతున్న అస్త్రం ఇది.
భారత్‌కు లాభం: మనకు కావాల్సింది చౌకైన ఇంధనం. అది రష్యా ఇచ్చినా, అమెరికా (వెనిజులా ద్వారా) ఇచ్చినా ఒకటే. వెనిజులా ఆయిల్ అందుబాటులోకి వస్తే.. భారత్‌కు ఇంధన భద్రత పెరుగుతుంది. రష్యాతో బేరసారాలకు (Bargaining) కూడా ఇది ఉపయోగపడుతుంది.
అమెరికా పెత్తనం: వెనిజులా ఆయిల్‌ను నియంత్రించడం ద్వారా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను ట్రంప్ శాసించబోతున్నారు. "మాతో కలిసి అమ్మండి.. లేదంటే అసలు అమ్మకండి" అని వెనిజులాకు చెప్పడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి (Also Read):

