Ram Charan Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’లో క్రేజీ స్పెషల్ సాంగ్.. ఏకంగా ఐదుగురు భామలతో బుచ్చిబాబు ప్లాన్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). అనౌన్స్‌మెంట్ రోజు నుంచే మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి అంశాన్ని ఎంతో స్పెషల్‌గా డిజైన్ చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు, తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం (స్పెషల్ సాంగ్) కోసం మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.
ఐదుగురు హీరోయిన్లతో పూనకాలే..
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ (ఐటెం సాంగ్) అంటే ఒకరు లేదా మహా అయితే ఇద్దరు భామలు హీరోతో కలిసి స్టెప్పులేస్తుంటారు. కానీ బుచ్చిబాబు ఆలోచన మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందట. ఈ ప్రత్యేక గీతంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు లేదా ఐదుగురు క్రేజీ స్టార్ హీరోయిన్లను నటింపజేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. ఈ ఐడియా కనుక వర్కవుట్ అయితే రామ్ చరణ్ పక్కన అంతమంది తారలు కలిసి చేసే సందడికి థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.
లాస్ట్‌లో స్పెషల్ సాంగ్ షూట్
ప్రస్తుతం ‘పెద్ది’ చిత్ర యూనిట్ మొత్తం రెగ్యులర్ షూటింగ్, టాకీ పార్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. ముందుగా పెండింగ్‌లో ఉన్న వర్క్ అంతా పూర్తి చేసిన తర్వాత, సినిమా చివర్లో ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణపై దృష్టి సారించాలని యూనిట్ నిర్ణయించుకుంది. ఇంతకీ చరణ్ పక్కన స్టెప్పులేసే ఆ ఐదుగురు లక్కీ ఛాన్స్ కొట్టే హీరోయిన్లు ఎవరనేది ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ రిలీజ్
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరుస్తున్న సాంగ్స్ అన్నీ అద్భుతంగా వస్తున్నాయని ఇన్‌సైడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా, వచ్చే ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

