Ustaad Bhagat Singh: థియేటర్ల టాప్ లేచిపోద్ది.. తమన్ బీజీఎమ్‌పై హరీష్ శంకర్ క్రేజీ ట్వీట్!
'ఓజీ' (OG) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఉగాది కానుకగా మార్చి 19న ఎల్లుండి (గురువారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమైంది. రిలీజ్‌కు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్, రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
రంగంలోకి దిగిన తమన్.. 'బావ' అంటూ హరీష్ ట్వీట్
ఈ చిత్రానికి వాస్తవానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా రిలీజ్ అనుకున్నదానికంటే ప్రీ పోన్ అవడంతో.. దేవిశ్రీ ప్రసాద్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను సంగీత దర్శకుడు థమన్‌కు (Thaman S) అప్పగించారు మేకర్స్. తాజాగా తమన్ తన వర్క్ మొత్తం పూర్తి చేశాడని దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ పోస్ట్ చేశారు. థమన్‌ను ‘బావ’ అని ఆప్యాయంగా సంబోధిస్తూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటలు కూడా సరిపోవడం లేదని హరీష్ పేర్కొన్నారు.
థియేటర్ల టాప్ లేచిపోవాల్సిందే!
"ఫైనల్ అవుట్‌పుట్ చూశాక నేను చాలా సంతోషంగా ఉన్నాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది.. థియేటర్ల టాప్ లేచిపోద్ది" అనేలా హరీష్ శంకర్ చేసిన పోస్ట్‌తో 'ఉస్తాద్' హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. పవన్ నటించిన 'ఓజీ' సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడు చివర్లో వచ్చి 'ఉస్తాద్'కు కూడా తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని హరీష్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మార్చి 19న బాక్సాఫీస్ జాతర
హరీష్ శంకర్ మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్, దానికి తోడు థమన్ అదిరిపోయే బీట్స్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 19న బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు దూసుకొస్తున్నాడు.
Also Read:
7 రోజుల డైట్ ప్లాన్: బరువు తగ్గడానికి సింపుల్ & బెస్ట్ ఇండియన్ ఫుడ్ చార్ట్!గుండె రక్తనాళాలను శుభ్రం చేసే 10 ఆహారాలు - హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టండి!
ఆవాలు (Mustard Seeds) ప్రయోజనాలు: కేవలం పోపు కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా!
విటమిన్-డి లోపం లక్షణాలు: నడుము నొప్పా? నీరసమా? అయితే జాగ్రత్త!

