ఎన్నికలు జరుగుతున్నది ఎక్కడో కేరళలో.. కానీ రాజకీయ మంటలు రేగుతున్నది మాత్రం మన తెలంగాణలో! ఒకవైపు మన రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి తమ ఆరు గ్యారంటీల పాలన అద్భుతం అని ప్రచారం చేస్తుంటే.. మరోవైపు తెలంగాణ బిడ్డగా కల్వకుంట్ల కవిత పేల్చిన పొలిటికల్ బాంబు ఇప్పుడు రెండు రాష్ట్రాలను కుదిపేస్తోంది. "మా సీఎం మాటలు నమ్మకండి.. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది" అంటూ ఆమె కేరళ ప్రజలకు ఇచ్చిన పిలుపు సామాన్యుడిని సైతం ఆలోచనలో పడేస్తోంది. అసలు కేరళ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో, ఏకంగా కొత్త పార్టీ పెడతానంటూ కవిత చేసిన సంచలన ప్రకటన వెనుక ఉన్న అసలు గుట్టు ఏమిటి?
కేరళలో రేవంత్ ప్రచారం.. ఆరు గ్యారంటీల అస్త్రం!
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి ఇప్పుడు నేరుగా తెలంగాణను తాకింది. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కేరళలో కాంగ్రెస్ పార్టీ తరపున సుడిగాలి ప్రచారం చేయడమే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
పినరయి విజయన్ కేరళ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ, దేశానికే ఆదర్శవంతమైన అభివృద్ధి పాలన అందిస్తోందని అక్కడి వేదికల మీద గర్వంగా చెబుతున్నారు. కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ గ్యారంటీలు పక్కాగా అమలవుతాయని ప్రజలకు గట్టి హామీ ఇస్తున్నారు.
కవిత కౌంటర్ ఎటాక్.. ట్విట్టర్ వేదికగా సంచలనం
సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనూహ్యంగా రంగంలోకి దిగారు. రేవంత్ హామీలకు కౌంటర్‌గా ఆమె ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక సంచలన వీడియోను రిలీజ్ చేశారు.
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిలువునా మోసం చేశారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని కుండబద్దలు కొట్టారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హాఫ్ (సగం) గ్యారంటీని మాత్రమే అమలు చేసి, మిగిలిన హామీలన్నింటినీ అటకెక్కించారని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
కొత్త పార్టీ పెడుతున్నా.. తెలంగాణ ఏటీఎం అయ్యింది!
"నేను తెలంగాణ బిడ్డను, ఇక్కడే ఉంటున్నా.. త్వరలోనే నేను తెలంగాణలో ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాను" అంటూ కవిత చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ బిడ్డగా నమ్మకంతో చెబుతున్నానని, కాంగ్రెస్ పార్టీ కేరళ ప్రజలను సైతం మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆమె హెచ్చరించారు.
నెలకు రూ.2500 ఇస్తామని మహిళలను, ఉద్యోగాలు ఇస్తామని యువతను, బోనస్ ఇస్తామని రైతులను, పెన్షన్లు పెంచుతామని వృద్ధులను, రిజర్వేషన్లు అమలు చేస్తామని బీసీలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని కవిత ఆ వీడియోలో ఏకరువు పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ హిస్టరీ మొత్తం మోసపూరితమేనని, ఆ పార్టీకి అవినీతి, మోసం తప్ప మరేమీ చేతకాదని ఫైర్ అయ్యారు. తెలంగాణను కాంగ్రెస్ ఒక ఏటీఎం (ATM) మాదిరిగా వాడుకుంటోందని.. కేరళ ఎన్నికల ఖర్చులకు సైతం తెలంగాణ నుంచే డబ్బు వెళ్తోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
పినరయినే గెలిపించండి.. కేరళ ఓటర్లకు విజ్ఞప్తి
చివరగా కవిత కేరళ ఓటర్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే కేరళలో అద్భుతమైన పాలన అందించారని ఆమె ప్రశంసించారు. "దయచేసి మా సీఎం మాటలు నమ్మకండి. వామపక్షాలకు (లెఫ్ట్) ఓటేయండి, పినరయి విజయన్ గారిని తిరిగి గెలిపించండి. ఇదే కేరళ ప్రజలకు నా రిక్వెస్ట్" అంటూ ఆమె తన వీడియో సందేశాన్ని ముగించారు.
కవిత పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్!
కేరళ ఎన్నికల సాక్షిగా తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇక్కడ సామాన్యుడు గమనించాల్సిన అసలు పాయింట్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కాదు.. కవిత "కొత్త పార్టీ" ప్రకటన! బీఆర్ఎస్ కు కాస్త దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్న కవిత, ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ పెడతానని ప్రకటించడం గులాబీ దళంలో ప్రకంపనలకు సంకేతమా?
The @INCIndia and @RahulGandhi cheated Telangana. People of Telangana were promised "6 Guarantees" but got ghosted. Now, @revanth_anumula is bringing that same script to Kerala.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 7, 2026
From farm loan waivers to job creation to farmer welfare, literally all of his promises in Telangana… pic.twitter.com/CKqeCGRnPZ
Also Read:
Soil Health Volunteers: తెలంగాణలో 30 వేల మంది వాలంటీర్లు
అప్పా జంక్షన్లో హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!
Indira Mahila Shakti: మహిళల చేతుల్లో పెట్రోల్ బంకులు
టీజీఎస్ఆర్టీసీకి కోర్టు షాక్.. ప్రమాద బాధితుడికి రూ.89 లక్షల పరిహారం!

