[FEATURED_IMAGE]
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి కమర్షియల్ హిట్స్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి మెగాఫోన్ పట్టిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సూర్య సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటీమణులు రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో మాత్రం దీని బిజినెస్ లెక్కలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమా బడ్జెట్, మార్కెట్ లెక్కల ప్రకారం.. ఈ ఫ్యామిలీ డ్రామా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 190 కోట్ల నుంచి రూ. 200 కోట్ల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తేనే బయ్యర్లు సేఫ్ జోన్‌లోకి వెళ్తారు. ఈ భారీ టార్గెట్‌ను అందుకోవాలంటే కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.
సూర్యకు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న మార్కెట్ స్టామినాకు, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఎమోషనల్ మ్యూజిక్ తోడైతే ఈ నంబర్స్ పెద్ద కష్టమేమీ కాదని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రేపు ఉదయం పడే ఫస్ట్ షో టాక్‌పైనే ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉంటే మాత్రం స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

