నిన్న మొన్నటి వరకు పాస్టర్ పగడాల ప్రవీణ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా ఉండగా, ఇప్పుడు దానిని పక్కకు నెట్టి అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
పచ్చళ్ల వ్యాపారంలో భాగంగా కస్టమర్లతో అలేఖ్య మాట్లాడిన అసహ్యకరమైన మాటలకు సంబంధించిన ఆడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంతకాలం వారి పచ్చళ్ల వ్యాపారాన్ని పొగిడిన వారే ఇప్పుడు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలోనూ అలేఖ్య చాలా మందిని ఇలాగే దుర్భాషలాడిందని, ఇప్పుడిప్పుడే ఆమె ప్రవర్తన బయటపడుతోందని అంటున్నారు.
అలేఖ్య సిస్టర్స్‌కు కొత్త సమస్య!
అలేఖ్య వివాదంపై సోషల్ మీడియాలో జోకులు వెల్లువెత్తుతున్నాయి. ఆకర్షణీయమైన మీమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నెటిజన్లు అలేఖ్య సిస్టర్స్ ముందు ఒక కొత్త డిమాండ్‌ను ఉంచారు. "తిట్టిన అమ్మాయి (అలేఖ్య), తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. లేదా, అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు ఆ యువకుడిని వివాహం చేసుకోవాలి. ఎందుకంటే, 'ముష్టి పికెల్స్ కొనలేనివాడు' అంటూ ఆమె అతడిని సమాజం ముందు నిలబెట్టి పరువు తీసింది. అతడికి పెళ్లి సంబంధాలు రావడం కష్టం కావచ్చు. ఏ అమ్మాయి కూడా అతడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ సమస్య నుండి అతడు బయటపడాలంటే, అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు అతడిని పెళ్లి చేసుకోవడమే ఉత్తమ మార్గం" అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.