కొందరు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలై అనేక సమస్యలు కొని తెచ్చుకుంటే, మరికొందరు దానితో ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. కొన్నిసార్లు ఇదే స్మార్ట్‌ఫోన్ పెద్ద సమస్యలను సైతం సులభంగా పరిష్కరిస్తుంది. మనుషులు చేయలేని పనులను కూడా ఇది సునాయాసంగా పూర్తి చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు మన కళ్లముందు జరుగుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు దొంగలు రాత్రిపూట ఒక బైక్‌ను దొంగిలించడానికి ప్రయత్నించారు. ఎంతో తెలివిగా బైక్‌ను ఎత్తుకెళ్లాలని చూస్తుండగా, అక్కడే ఉన్న ఒక వ్యక్తి వారిని వీడియో తీయడం ప్రారంభించాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి...
సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు దొంగలు రాత్రి సమయంలో చోరీ చేయడానికి వెళ్లారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఒక బైక్‌ను చూసిన దొంగలు, దానిని ఎత్తుకెళ్లడానికి పథకం వేశారు. వారిలో ఒకడు కాస్త దూరంగా నిలబడి గమనిస్తుండగా, మరొకడు బైక్ వద్దకు వెళ్లాడు. మొదటగా బైక్ హ్యాండిల్ వద్ద ఉన్న వైర్లను అటూ ఇటూ కలిపి జాయింట్ చేశాడు. వైర్లను కలపడంతో ఆఫ్‌లో ఉన్న లైట్లు కూడా వెలిగాయి. ఆ తర్వాత లాక్‌లో ఉన్న హ్యాండిల్‌ను కాలితో తన్నుతూ అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించాడు.
అయితే అదే సమయంలో ఒక ఇంటిపై ఉన్న వ్యక్తి ఇదంతా వీడియో తీస్తూ ఉన్నాడు. తర్వాత ఆ దొంగను పిలిచి సరదాగా మాట్లాడతాడు. ఆ వ్యక్తిని చూసినా కూడా ఆ దొంగలో భయం కనిపించలేదు. పైగా హ్యాండిల్‌ను తన్నుతూ అన్‌లాక్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి వీడియో తీస్తున్నాడనే విషయం గమనించిన ఆ దొంగలు అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. ఈ విధంగా ఒక ఫోన్ సహాయంతో దొంగలను భయపెట్టి, బైక్ చోరీ కాకుండా కాపాడాడు ఆ వ్యక్తి.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "మనిషికి భయపడని దొంగ కెమెరాకు భయపడ్డాడు" అని కొందరు, "దొంగలను పరుగులు పెట్టించిన కెమెరా" అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2500కు పైగా లైక్‌లు మరియు 80 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Bike chor got caught in 4k pic.twitter.com/ws9XLBSQUB
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 4, 2025