దర్శకుడు మారుతి మాట్లాడుతూ, "'పాంచ్ మినార్' టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చూడగానే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా రాజ్ తరుణ్‌కి కూడా మళ్లీ ఉత్తమమైన ప్రారంభాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. గోవింద రాజు గారు విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా తీశారు. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించండి" అని అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, రాశీ సింగ్ హీరోయిన్‌గా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పాంచ్ మినార్'.
మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి దర్శకులు-నిర్మాతలు మారుతి, సాయి రాజేష్, ఎస్కేఎన్, రచయిత 'డార్లింగ్' స్వామి అతిథులుగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ, "ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని చెప్పడానికి కారణం మా దర్శకుడి కష్టం... ఆయన విజన్" అని తెలిపారు.
"రాజ్ తరుణ్‌కు ఇది మంచి పునరాగమన చిత్రం అవుతుంది" అని రామ్ కడుముల తెలిపారు. "ఇది పూర్తి వినోదాత్మక చిత్రం" అని చిత్ర నిర్మాత ఎమ్ఎస్ఎమ్ రెడ్డి, సమర్పకుడు గోవిందరాజు అన్నారు. "కష్టాల్ని హాస్యంగా చెప్పే ఏ కథ కూడా నిరుత్సాహపరచదని 'పాంచ్ మినార్' నిరూపించబోతోంది" అని రచయిత అనంత శ్రీరామ్ అన్నారు.