Horoscope today in telugu | నేటి రాశి ఫలాలు (14 ఏప్రిల్ 2025) | మీ రాశి ఫలం తెలుసుకోండి

naveen
By -
0


మేషం: పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. విద్యార్థులు చేసిన కృషి ఫలితం లేకుండా పోవచ్చు. బంధువులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది తప్పదు.

వృషభం: కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.

మిథునం: దూరపు బంధువులను కలుసుకుంటారు. మంచి వార్తలు వింటారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటకం: బంధువులతో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. దేవాలయాలను సందర్శిస్తారు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలలో సాధారణ లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.

సింహం: సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సన్నిహితులు మరియు స్నేహితులతో సఖ్యతగా ఉంటారు.

కన్య: బంధువులతో విరోధం ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనులు వాయిదా పడతాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఊహించని ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.

తుల: కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. అనుకోకుండా ధన లాభం కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి పిలుపు వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

వృశ్చికం: కొత్త పనులను ప్రారంభిస్తారు. వస్తువులు లాభిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి.

ధనుస్సు: మీ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది.

మకరం: కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో చిన్న సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.

కుంభం: ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఊహించని పదవులు లభిస్తాయి.

మీనం: మీరు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. వస్తువులు లాభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో కొత్త పదవులు లభిస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!