horoscope today in telugu | నేటి రాశి ఫలాలు (ఏప్రిల్ 13, 2025): మీ రాశి ఫలం తెలుసుకోండి!

naveen
By -
0


 

మేషం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువులు మరియు స్నేహితులతో ఉత్సాహంగా సమయం గడుపుతారు. వృత్తి మరియు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దేవాలయాలను సందర్శిస్తారు.


వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు సిద్ధిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి మరియు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులు మరియు విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.


మిథునం: రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కార్యక్రమాలలో తొందరపాటు ఉంటుంది. బంధువులతో విరోధాలు ఏర్పడవచ్చు. దొంగల భయం ఉంటుంది. వ్యాపారులకు నిరాశ కలిగించే రోజు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి.


కర్కాటకం: కష్టపడినప్పటికీ ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి మరియు వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. కళాకారులకు సమస్యలు పెరుగుతాయి.


సింహం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి మరియు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. ధన లాభం ఉంటుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.


కన్య: కుటుంబ మరియు ఆరోగ్య సమస్యలుంటాయి. చేపట్టిన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలుంటాయి.


తుల: కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి మరియు వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చాలా కాలం నుండి ఉన్న శత్రువులు స్నేహితులుగా మారతారు.


వృశ్చికం: ఆదాయం తగ్గి అప్పులు చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దుబారా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో సమస్యలుంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులుంటాయి.


ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొంత అనుకూలత ఉంటుంది.


మకరం: ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల నుండి ధన లాభం ఉంటుంది. వృత్తి మరియు వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కళాకారుల పర్యటనలు వాయిదా పడతాయి.


కుంభం: ప్రయాణాలు వాయిదా పడతాయి. కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడతాయి. స్నేహితులతో విభేదాలు రావచ్చు. ఆరోగ్య సమస్యలుంటాయి. వృత్తి మరియు వ్యాపారాలు మందగిస్తాయి. మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబంలో సమస్యలుంటాయి.


మీనం: ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగాలలో సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉంటాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!