కాకరకాయ పేరు వినగానే చాలా మంది ముఖం తిప్పుకుంటారు. దాని చేదు రుచి కారణంగా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ, చేదుగా ఉండే కాకరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం దానిని పచ్చిగా కూడా తినడానికి వెనుకాడరని ఆయుర్వేద మరియు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వారు అంటున్నారు. తరచూ కాకరకాయ తినడం వల్ల శరీరంలో కలిగే మార్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
కాకరకాయ పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఐరన్, పొటాషియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాకరకాయలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అందుకే తరచూ కాకరకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది మరియు అజీర్తి సమస్య కూడా ఉండదు. కాకరకాయలో ఉండే చేదు కడుపులోని నులిపురుగులు మరియు ఇతర హానికరమైన క్రిములను నాశనం చేస్తుంది.
కాకరకాయను తరచుగా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. కాకరకాయలు తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా ఉంటాయి. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం ఉండదు మరియు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
కాకరకాయలో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి మరియు రక్తపోటును నియంత్రిస్తాయి. కాకరకాయ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు మరియు స్ట్రోక్ వంటివి రాకుండా ఉంటాయి. కాకరకాయలో ఉండే చేదు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. కాకరకాయలు తినడం వల్ల శరీరం బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
కాకరకాయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా మరియు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయి. కాకరకాయలను తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు మరియు ఆస్తమా, జలుబు వంటి సమస్యలు కూడా రావు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
కాకరకాయలో ఉండే పాలీపెప్టెడ్స్ అనే సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. క్రమం తప్పకుండా కాకరకాయ తింటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. కాకరకాయ రసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్ మరియు కామెర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాకరకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి కాకరకాయ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.