కొత్త బట్టలు కొన్న వెంటనే వేసుకుంటున్నారా? అయితే ఇది చదవండి!

 


చాలా మంది షాపింగ్‌కు వెళ్లినప్పుడు కొత్త బట్టలు కొనుగోలు చేసి, వాటిని ట్రయల్ రూమ్‌లో వేసుకుని చూసుకున్న తర్వాత నేరుగా ఇంటికి తెచ్చుకుని ధరించేస్తారు. కొందరైతే దేవుడి దగ్గర పెట్టి అలానే వేసుకుంటారు. అయితే, చర్మ నిపుణులు మాత్రం కొత్త బట్టలను నేరుగా ధరించవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల బట్టలు తయారుచేసేటప్పుడు ఉపయోగించే రసాయనాల వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అలా వేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం!

కొత్త బట్టలు వేసుకుంటే వచ్చే సమస్యలు

నేటి యువత స్టైలిష్‌గా ఉండటానికి తక్కువ ధరలో లభించే బట్టలను కొనుగోలు చేస్తున్నారు. అలా కొన్న ఒక కుర్రాడు కొత్త బట్టలు వేసుకున్న వెంటనే ఒంటిమీద ఎర్రటి పొక్కులు వచ్చాయి. అందరిలాగే కొత్త బట్టలు కదా అని వేసుకున్నాడు, కానీ దాని వల్ల అతడి శరీరం మొత్తం ఒక రకమైన ఇన్ఫెక్షన్‌తో దారుణంగా తయారైంది. తాను ఎదుర్కొన్న అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.

మొలస్కం కాంటాజియోసమ్: వైరల్ ఇన్ఫెక్షన్

ఈ పోస్ట్‌పై డెర్మటాలజిస్ట్‌లు స్పందించారు. అతడి పరిస్థితిని మొలస్కం కాంటాజియోసమ్ అనే అంటువ్యాధిగా నిర్ధారించారు. ఇది ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ అని వారు తెలిపారు.

పాత బట్టలు కూడా ప్రమాదకరమే!

ప్రస్తుతం రెట్రో ఫ్యాషన్ ట్రెండ్‌లో ఉంది. పర్యావరణ హితంగా రీసైకిల్ చేసిన పాత బట్టలను కూడా కొందరు కొనుగోలు చేస్తున్నారు. అలాంటివి కూడా కొన్న వెంటనే నేరుగా ధరిస్తే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త బట్టలు ఉతకడం తప్పనిసరి!

కొన్న వెంటనే ఎలాంటి బ్రాండెడ్ బట్టలైనా సరే, ఒక్కసారి ఉతికిన తర్వాతే ధరించడం మంచిదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. బట్టల రంగుల కోసం ఉపయోగించే గాఢ రసాయనాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. న్యూయార్క్‌కు చెందిన వైద్య నిపుణులు కూడా ఇలాంటి అవాంఛిత చర్మ సమస్యలను నివారించడానికి కొత్త స్టైలిష్ వేర్‌ను కూడా ఒక్కసారి ఉతికిన తర్వాతే ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు