ఈరోజు విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులలో ఒకడు. ఆయన పేరు వినగానే మనకు కనిపించే చిత్రం — లక్షలాది అభిమానులు, కోట్ల రూపాయల ఆస్తి, అద్భుతమైన రికార్డులు. కానీ ఈ ఘనతకు వెనుక ఎన్నో త్యాగాలు, కష్టాలు, సాధారణ జీవితం ఉన్నాయి. ఇదే విషయాన్ని కోహ్లీకి అత్యంత సన్నిహితుడైన క్రికెటర్ ఇషాంత్ శర్మ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేశాడు.
చిన్ననాటి నుండి విరాట్ సహచరుడు - ఇషాంత్ శర్మ
విరాట్ కోహ్లీ తనకు ‘చికూ’గా తెలిసిన వ్యక్తి అని, అతని కష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తిగా తాను గర్వంగా చెప్పగలనని ఇషాంత్ అన్నాడు. అండర్-19 రోజుల్లో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు, ఆహారం పంచుకునేవారు, పైసా పైసా లెక్క పెట్టుకొని ఖర్చు చేసేవారని చెప్పాడు. ఆ కాలంలో కోహ్లీ ప్రతి రూపాయిని ఆదా చేయడానికి ఎంతగా కష్టపడేవాడో గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.అతని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణే ఈరోజు ప్రపంచ స్థాయి స్థితికి తీసుకువచ్చాయని ఇషాంత్ అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికీ మితృత్వం కొనసాగుతోంది
ఈరోజు కూడా విరాట్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి విషయమైనా పంచుకునే వ్యక్తిగా ఇషాంత్‌ను భావిస్తాడు. క్రికెట్ మైదానంలో ఎదురైన ప్రతి పోరాటానికి పరస్పరం తోడుగా నిలిచిన ఈ ఇద్దరి మైత్రీకి ఇది నిదర్శనం.