జగదేకవీరుడు అతిలోకసుందరి రీరిలీజ్: సీక్వెల్ తీయాలంటూ రామ్ చరణ్ డిమాండ్!

naveen
By -
0

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ మూవీ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' విడుదలై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మేకర్స్ శుక్రవారం ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగాయి. చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ కలిసి అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాకు సీక్వెల్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'జగదేకవీరుడు' మా తరానికి అసలైన సోషియో ఫాంటసీ: రామ్ చరణ్

రామ్ చరణ్ తన వీడియోలో మాట్లాడుతూ, "'జగదేకవీరుడు అతిలోక సుందరి' మా తరానికి అసలైన సోషియో ఫాంటసీ సినిమా. ఈ చిత్రంలోని 'జై చిరంజీవా జగదేక వీర' అనే పాట చూసిన తర్వాతే నాకు ఆంజనేయుడి మీద భక్తి మొదలైనట్లు గుర్తు. ఇది నిజంగా డ్రీమ్ టీమ్ అని మా తరం మొత్తం నమ్ముతుంది. ఎందుకంటే చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు, శ్రీదేవి గారు, అశ్వినీదత్ గారు, ఇళయారాజా గారు, యండమూరి గారు, పరుచూరి గారు, విన్సెంట్ గారు.. ఇలాంటి లెజెండ్స్ అందరూ కలిసి ఈ సినిమా కోసం పనిచేశారు. మళ్లీ ఆ టీమ్ అంతా కలిసి పనిచేయలేదు. ఇక ఈ సినిమా చివర్లో చూపించినట్లుగా ఆ రింగు ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? అనే విషయాలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది రిక్వెస్ట్ కాదు.. మా డిమాండ్" అని అన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ డిమాండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

'గేమ్ ఛేంజర్' తర్వాత 'పెద్ది'లో చరణ్

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ తర్వాత ఆయన బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి మాట్లాడుతూ, 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకు సీక్వెల్ తీయాల్సి వస్తే రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించాలని, అశ్వనీదత్ పిల్లలు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!