అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్: అట్లీతో పాటు ఆ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు!

naveen
By -
0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమా తర్వాత ఆయన ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగింది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమాలో దీపికా పదుకొణె బన్నీ సరసన హీరోయిన్‌గా కనిపించనున్నారని మేకర్స్ ప్రకటించారు.

అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయనున్నాడని టాక్. అలాగే, బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లోనూ ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రెండింటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇప్పుడు బన్నీ డైరెక్టర్ల జాబితాలోకి మరో కొత్త పేరు వచ్చి చేరింది. తాజాగా బన్నీ నెక్స్ట్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో బన్నీ సినిమా?

అట్లీ సినిమా తర్వాత బన్నీ, మలయాళంలో సంచలనాలు సృష్టిస్తున్న యువ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. ప్రస్తుతం మలయాళంలో నటుడిగా, దర్శకుడిగా బాసిల్ జోసెఫ్ అద్భుతమైన విజయాలు అందుకుంటున్నారు. ఆయన 2021లో మిన్నల్ మురళి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత జయ జయ జయ జయహే, సూక్ష్మదర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాసిల్ జోసెఫ్ తెరకెక్కించిన మూడు సినిమాలు భారీ విజయాలను సాధించాయి. కేవలం మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన బాసిల్, ఇప్పుడు నేరుగా బన్నీతో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

నిజానికి కేరళలో బన్నీకి విపరీతమైన క్రేజ్ ఉంది.  ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడనే వార్త సినీ వర్గాల్లో వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!