డైరెక్టర్ వెంకీ అట్లూరి: అక్కినేని నాగచైతన్యతో సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు

naveen
By -
0

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. మొదట నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత దర్శకుడిగా మారి విజయం సాధించారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ, టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్, మలయాళం స్టార్ హీరోలతోనూ సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఓ చిత్రంపై పని చేస్తున్న వెంకీ, ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో తెరకెక్కించిన "లక్కీ భాస్కర్" సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం తర్వాత ఆయన తదుపరి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెంకీ తన సినిమా ప్లానింగ్స్, తెలుగు స్టార్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అక్కినేని నాగచైతన్యతో సినిమాపై వెంకీ అట్లూరి కామెంట్స్

వెంకీ అట్లూరి అక్కినేని కుటుంబానికి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన అఖిల్ అక్కినేని హీరోగా "మిస్టర్ మజ్ను" సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి నుంచి వెంకీ అక్కినేని నాగచైతన్యతో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై స్పందిస్తూ వెంకీ మాట్లాడుతూ, తాను రాసుకున్న ప్రతి కథను ముందుగా నాగచైతన్యకే చెబుతానని వెల్లడించారు. ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా కథను కూడా ఆయనకే వివరించినట్లు తెలిపారు.

"ప్రతిసారీ డేట్స్ కుదరట్లేదు.." - వెంకీ అట్లూరి

వెంకీ మాట్లాడుతూ, "నేను ఇప్పటివరకూ రాసుకున్న ప్రతి కథ చైతన్యకే చెప్పాను. నేను తీసిన 5 సినిమాలు ప్రతిదీ మొదట ఆయనకే చెప్పాను. ప్రతిసారీ డేట్స్ కుదరకపోవడమో.. ఏదో ఒక కారణంతో మా ఇద్దరి కాంబో సెట్ కాలేదు. కలిసినప్పుడల్లా ఈ విషయంపై జోక్స్ వేసుకుంటాం. నెక్ట్స్ టైం కలిసి పని చేద్దామని మాట్లాడుకుంటాం" అని వివరించారు. ఇటీవలే నాగచైతన్య "తండేల్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.  ఈ నేపథ్యంలో వెంకీ, నాగచైతన్య కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!