బిగ్‌బాస్ గేమ్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వచ్చిన హరీష్, హౌస్‌లో ఏం జరుగుతుందో తెలియని కంటెస్టెంట్లను ఒక ఆట ఆడుకుంటూ, మొత్తం ఎపిసోడ్‌ను తన భుజాలపై మోశాడు.
ఓనర్లు vs టెనెంట్లు.. బిగ్‌బాస్ పెట్టిన తొలి ఫిట్టింగ్
"గేమ్ ఛేంజర్" పాటతో ఎనర్జిటిక్‌గా మొదలైన రోజులో, మెయిన్ హౌస్ ఓనర్లయిన సామాన్యులు.. ఔట్ హౌస్ టెనెంట్లయిన సెలబ్రిటీలకు ఒక ఆఫర్ ఇచ్చారు. "మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే ఇంట్లోకి రానిస్తాం" అని చెప్పగా, బిగ్‌బాస్ వెంటనే కల్పించుకుని షాకిచ్చాడు. "ఈ ఇల్లు ఓనర్లది. ఇప్పుడు సెలబ్రిటీలు అగ్నిపరీక్ష ఎదుర్కొని, ఓనర్లుగా మారేందుకు అర్హత సాధించాలి" అని ప్రకటించి, అసలు సిసలైన ఆటను మొదలుపెట్టాడు.
పనుల పంచాయితీ.. ప్రియ, మనీష్‌తో హరీష్ వాగ్వాదం
ఇంటి పనుల కేటాయింపులో అసలు గొడవ మొదలైంది. "వంట చేసేవాళ్లు కిచెన్ క్లీనింగ్ చేయరు, నేను చేయనివ్వను" అని ప్రియ చేసిన ఒకే ఒక్క కామెంట్‌తో హరీష్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రియతో తీవ్ర వాగ్వాదానికి దిగిన హరీష్, మధ్యలో కల్పించుకున్న మనీష్‌పై కూడా విరుచుకుపడ్డాడు. దీంతో మిగిలిన సామాన్యులు ఏకమై, "హరీష్ మనందరికీ లీడర్‌లా ప్రవర్తిస్తున్నాడు" అని గుసగుసలాడటం మొదలుపెట్టారు.
'ఆకలి' రాజకీయం.. బిగ్‌బాస్‌ను ఎదిరించిన హరీష్
పనులు చేశాక సెలబ్రిటీలు భోజనం చేస్తుండగా, "టెనెంట్స్ బయటకు వెళ్ళండి" అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు. దీనికి చలించిపోయిన హరీష్, కెమెరా ముందుకు వెళ్లి బిగ్‌బాస్‌ను ప్రశ్నించాడు. "ఇమ్మాన్యుయేల్ చాలా కష్టపడ్డాడు, తిననివ్వండి. నా శత్రువైనా నేను నోటి కాడ కూడు లాక్కోను" అంటూ ఎమోషనల్ అయ్యాడు. బిగ్‌బాస్ స్పందించకపోవడంతో, రూల్స్ బ్రేక్ చేసి అరటిపళ్ళు, బిస్కెట్లు తీసుకుని సెలబ్రిటీలకు ఇవ్వడానికి ప్రయత్నించాడు. వారు భయంతో వద్దనడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. "ఇది లైఫ్‌ని మించిన గేమ్ కాదు, దేవుడొచ్చినా నేను ఒప్పుకోను" అంటూ బిగ్‌బాస్‌కే సవాల్ విసిరాడు.
'గుండు అంకుల్' గొడవ.. ఇమ్మాన్యుయేల్‌పై ఫైర్
ఆ తర్వాత గార్డెన్‌లో ఫుడ్ ఏర్పాటు చేసిన బిగ్‌బాస్, ఇమ్మాన్యుయేల్‌కు ఒక పని అప్పగించి, దానికి మానిటర్‌గా హరీష్‌ను నియమించాడు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ సరదాగా హరీష్‌ను "గుండు అంకుల్" అని పిలవడంతో మరో గొడవ మొదలైంది. మొదట సైలెంట్‌గా ఉన్న హరీష్, కాసేపటి తర్వాత తీవ్రంగా స్పందిస్తూ, "చూసి మాట్లాడాలి బ్రదర్, బాడీ షేమింగ్ చేయొద్దు" అని ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగగా, తర్వాత ఇమ్మాన్యుయేల్ సారీ చెప్పి గొడవను సద్దుమణిగేలా చేశాడు. దీనికి హరీష్, "నాకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నా నెత్తిన ఎక్కాలని చూస్తే తొక్కుతా" అని తన మార్క్ డైలాగ్ కొట్టాడు.
తొలిరోజే హీరో, విలన్.. అన్నీ తానై!
ఒకే రోజులో బిగ్‌బాస్‌ను ఎదిరించిన ధైర్యం (శివాజీలా), కంటెస్టెంట్ ఆకలి కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఎమోషన్ (రైతుబిడ్డలా) చూపించి హరీష్ తొలిరోజే తన ముద్ర వేశాడు. ఈ ఎపిసోడ్ తర్వాత, మొదటి వారం నామినేషన్స్‌లో ఎక్కువమంది హరీష్‌ను టార్గెట్ చేయడం ఖాయం. అదే జరిగితే, అతను ఈ సీజన్‌లో తిరుగులేని కంటెస్టెంట్‌గా మారడం పక్కా అనిపిస్తోంది.