ఆండ్రియా న్యూడ్ పోస్టర్ వివాదం: అసలు నిజం చెప్పేసింది!

moksha
By -

ఆ పోస్టర్ చూసి అందరూ షాక్ అయ్యారు.. ఆండ్రియా నిజంగానే న్యూడ్‌గా నటించిందా? అని అనుమానపడ్డారు. కానీ ఇన్నాళ్లకు ఆ బ్యూటీ బయటపెట్టిన అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!


Andrea Jeremiah clarifies nude poster controversy.


కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘పిశాచి 2’ సినిమాపై ఎట్టకేలకు హీరోయిన్ ఆండ్రియా జెరెమియా మౌనం వీడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన తన న్యూడ్ పోస్టర్‌పై స్పష్టమైన వివరణ ఇస్తూ, షాకింగ్ విషయాలు వెల్లడించింది. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, విడుదలకు నోచుకోలేదు.


ఆ సీన్ ఎప్పుడో లేపేశారు!

కథా చర్చల సమయంలో డైరెక్టర్ మిస్కిన్ ఒక బోల్డ్ సీన్ గురించి చెప్పిన మాట వాస్తవమేనని ఆండ్రియా అంగీకరించింది. అయితే, అసలు షూటింగ్ సమయానికి వచ్చేసరికి ఆ సీన్‌ను పూర్తిగా తొలగించారని ఆమె వెల్లడించింది.


"నేను నగ్నంగా నటించలేదు"

సినిమా కోసం విడుదలైన పోస్టర్‌లో ఆండ్రియా నగ్నంగా ఉందన్న ప్రచారంపై ఆమె ఘాటుగా స్పందించింది. “పిశాచి 2 కోసం నేను ఎలాంటి న్యూడ్ సన్నివేశాల్లోనూ నటించలేదు. ఆ సినిమాలో ఎవ్వరూ అలాంటి సీన్లు చేయలేదు” అని కుండబద్దలు కొట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టర్‌కు, సినిమాలోని కంటెంట్‌కు నేరుగా సంబంధం లేదని స్పష్టం చేసింది. కథకు అవసరమైనంత మేరకే బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలిపింది.


Tags: