కర్ణాటక సీఎం మార్పు: డీకేకు రాహుల్ వాట్సాప్ మెసేజ్!

naveen
By -
0

కర్ణాటక సీఎం కుర్చీ కోసం ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది! డీకే శివకుమార్ వారం రోజులుగా ఎదురుచూస్తుంటే.. రాహుల్ గాంధీ పంపిన ఆ ఒక్క మెసేజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.



కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. సిద్ధరామయ్యనే కొనసాగించాలా? లేక డీకే శివకుమార్‌కు పగ్గాలు ఇవ్వాలా? అన్నదానిపై ఢిల్లీ వేదికగా మల్లగుల్లాలు పడుతోంది. డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే లోపే ఈ సస్పెన్స్‌కు తెరదించాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే, రాహుల్ గాంధీని కలిసేందుకు డీకే శివకుమార్ గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఈ తరుణంలో రాహుల్ నుంచి డీకేకు ఒక ఆసక్తికరమైన వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. "దయచేసి వేచి ఉండండి, నేను మీకు కాల్ చేస్తా" అని రాహుల్ స్వయంగా మెసేజ్ చేశారట.


మరోవైపు, ఈ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాలపై దృష్టి సారించింది. ఒకవేళ నాయకత్వ మార్పు జరిగితే ఓట్ బ్యాంక్ దెబ్బతినకుండా ఉండేలా కొత్త ఫార్ములాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్ పరిశీలిస్తున్న ప్లాన్ ఇదే:

  • డీకేకు సీఎం పీఠం: ఒకవేళ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే, ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు.

  • కీలక పదవుల పంపకం: పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవులను ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులకు కేటాయించడం.

  • సంయమనం పాటించాలి: ఇటు డీకే, అటు సిద్ధూ వర్గాలు సంయమనం పాటించాలని రాహుల్ గాంధీ.. మంత్రి ప్రియాంక్ ఖర్గే ద్వారా సందేశం పంపారు.


ఇదిలా ఉండగా, డీకే శివకుమార్ నవంబర్ 29న ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కర్ణాటక నేతలు ప్రియాంక్ ఖర్గే, శరత్ బచ్చేగౌడతో సమావేశమై, ప్రియాంక్ ఖర్గేతో ప్రత్యేకంగా 20 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Tags:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!