సమంత పెళ్లి తర్వాత అందరి దృష్టీ రాజ్ నిడిమోరు మాజీ భార్యపై పడింది. ఆమె చేసిన లేటెస్ట్ పోస్ట్ చూస్తే, ఆమె ఉన్న పరిస్థితి అర్థమై కన్నీళ్లు ఆగవు!
నెట్టింట వైరల్ అవుతున్న శ్యామలీ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీ దే సోషల్ మీడియా పోస్టులపై నెటిజన్ల దృష్టి పడింది. అందరూ తనపై జాలి చూపిస్తుండటంతో ఆమె స్పందించారు.
తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని, తన నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు ఆశించవద్దని ఆమె తేల్చి చెప్పారు. తనకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదని, తన ఖాతాలను తానే నిర్వహించుకుంటానని స్పష్టం చేశారు.
"నా గురువు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.."
ప్రస్తుతం తాను ఎలాంటి విషయాలను పట్టించుకునే స్థితిలో లేనని శ్యామలీ దే ఆవేదన వ్యక్తం చేశారు. దానికి గల బలమైన కారణాన్ని ఆమె బయటపెట్టారు. తన గురువు గారు క్యాన్సర్ బారిన పడినట్లు ఇటీవల తెలిసిందని, ఆయన గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఎమోషనల్ అయ్యారు. కేవలం ఆయన కోసమే ప్రార్థిస్తున్నానని, దయచేసి తన బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తనపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటానని ఆమె రాసుకొచ్చారు. రాజ్ నిడిమోరు 2015లో శ్యామలీని వివాహం చేసుకోగా, కొన్నాళ్లకే వారు విడిపోయారు.

