టాలీవుడ్‌లో ప్రస్తుతం మహిళల డ్రెస్సింగ్, వ్యక్తిగత స్వేచ్ఛ చుట్టూ జరుగుతున్న రచ్చ పతాక స్థాయికి చేరింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ మంటలో, ఇప్పుడు ఆర్జే శేఖర్ బాషా (Shekar Basha) పెట్రోల్ పోశారు. చిన్మయి, అనసూయలపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిప్పు రాజేస్తున్నాయి. "అప్పుడు మాట్లాడని నోర్లు.. ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి?" అని శేఖర్ బాషా వేసిన ప్రశ్నలకు నెటిజన్లు కూడా మద్దతు పలుకుతున్నారు.
ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ బాషా, మహిళా హక్కుల గురించి మాట్లాడే ముందు వారి గత ప్రవర్తనను కూడా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా గాయని చిన్మయిని టార్గెట్ చేస్తూ, గతంలో ఆమె 'రోబో' సినిమాలో 'కిలిమంజారో' పాట పాడిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో 'నా సోకు పళ్లే తిని వెన్ను పట్టి ఆరబెట్టేయి హనీ' అనే లిరిక్స్ ఉన్నాయని, ఆ పదాలు పలికినప్పుడు ఆమెకు అసభ్యంగా అనిపించలేదా అని శేఖర్ బాషా సూటిగా నిలదీశారు. తన దాకా వస్తే గానీ నొప్పి తెలియదా అంటూ పరోక్షంగా చురకలు అంటించారు.
అలాగే యాంకర్ అనసూయపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె జబర్దస్త్ షోలో చేసిన స్కిట్లను, అక్కడ పలికిన డబుల్ మీనింగ్ డైలాగులను ప్రస్తావించారు. ముఖ్యంగా 'రాశి గారి ఫలాలు' అంటూ సాగే సంభాషణలు చెప్పినప్పుడు అనసూయకు సంప్రదాయం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. వీళ్లకు మహిళా హక్కులు, సంప్రదాయాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, కేవలం డబ్బుల కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతారని, డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే రకాలు వీళ్లు అంటూ శేఖర్ బాషా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇండస్ట్రీ పెద్దలు మహిళలను కించపరిచేలా మాట్లాడినప్పుడు వీరు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు.
ఆశ్చర్యకరంగా శేఖర్ బాషా చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. "నువ్వే కరెక్ట్ బ్రో.. వీళ్లకు ఇలాగే చెప్పాలి" అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే కరాటే కళ్యాణి కూడా శేఖర్ బాషా బాటలోనే అనసూయ, చిన్మయిలపై విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఈ వివాదం అసలు విషయాన్ని పక్కనపెట్టి, వ్యక్తిగత దూషణల పర్వంగా మారుతోంది. శేఖర్ బాషా వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి ఎలా స్పందిస్తారో చూడాలి.
బాటమ్ లైన్..
ఈ వివాదం చూస్తుంటే.. అసలు విషయం పక్కకు వెళ్లి, వ్యక్తిగత ద్వేషాలు బయటపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శేఖర్ బాషా లేవనెత్తిన పాయింట్‌లో లాజిక్ ఉంది. ఒక విషయంపై స్పందించేటప్పుడు.. అదే తప్పు తాము గతంలో చేసినప్పుడు కూడా అంగీకరించే ధైర్యం ఉండాలి. 'నాకు నచ్చినప్పుడు మాట్లాడతా.. లేనప్పుడు సైలెంట్‌గా ఉంటా' అంటే జనం నమ్మరు. దీన్నే 'సెలెక్టివ్ ఫెమినిజం' అంటారు. అయితే, విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది కానీ.. "నీచానికి దిగజారే రకాలు" అని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సబబు? మహిళల గౌరవం గురించి మాట్లాడుతూనే.. వారిని కించపరిచే పదాలు వాడటం సరైన పద్ధతి కాదు. ఈ రచ్చలో అసలైన మహిళా సమస్యలు మరుగున పడిపోతున్నాయి.

