మోదీ ఫోన్ చేయలేదని డీల్ ఆగిపోయిందా? అమెరికా మంత్రికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలేం జరిగింది?
"ఒక ఫోన్ కాల్ దూరం.. ఒప్పందం పాయే!" అంటూ అమెరికా వాణిజ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్యవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయనందువల్లే.. ఇరు దేశాల మధ్య జరగాల్సిన కీలక వాణిజ్య ఒప్పందం (Trade Deal) కుదరలేదని అగ్రరాజ్యం ఆరోపించింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. "మీరు చెబుతున్నది అవాస్తవం.. చర్చలు ఆగిపోవడానికి కారణం అది కాదు" అంటూ భారత విదేశాంగ శాఖ (MEA) గట్టిగా బదులిచ్చింది.
అసలు విషయం ఏంటంటే.. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా మంత్రి వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని తేల్చిచెప్పింది. "మేము గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. చాలాసార్లు ఒప్పందానికి దగ్గరగా వచ్చాం. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య రాజకీయ చొరవ లేదన్నది అబద్ధం.
2025లోనే వీరిద్దరూ వివిధ అంశాలపై ఏకంగా 8 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు" అని MEA గణాంకాలను బయటపెట్టింది. వాస్తవానికి భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ (పన్ను) విధించాలన్న అమెరికా నిర్ణయంపైనే చర్చలు ప్రధానంగా నడుస్తున్నాయని, త్వరలోనే ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదురుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.
బాటమ్ లైన్..
అమెరికా ఆరోపణలు చూస్తుంటే.. ఇది వాణిజ్యం కంటే "ఈగో" (Ego) సమస్యలా కనిపిస్తోంది.
ప్రెజర్ టాక్టిక్స్: ట్రంప్ యంత్రాంగం ఎప్పుడూ వ్యాపార ధోరణితోనే ఆలోచిస్తుంది. "మాకు ఫోన్ చేసి బతిమలాడలేదు" అని చెప్పడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచి, తమకు అనుకూలమైన షరతులతో ఒప్పందం చేసుకోవాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.
అసలు సమస్య టారిఫ్స్: ఫోన్ కాల్స్ కాదు, అసలు సమస్య 50 శాతం పన్నులు. భారత వస్తువులపై భారీ పన్నులు వేస్తామంటే.. ఏ దేశమైనా ఆచితూచి అడుగులేస్తుంది. భారత్ చేస్తున్నది అదే.
దౌత్యం వర్సెస్ రియాలిటీ: 8 సార్లు మాట్లాడుకున్న నేతల మధ్య.. "ఒక్క ఫోన్ కాల్ చేయలేదని డీల్ ఆగిపోయింది" అనడం నమ్మశక్యంగా లేదు. ఇది అమెరికా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెబుతున్న సాకులా ఉంది.

