Dhurandhar 2 Remunerations: అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్

naveen
By -
Dhurandhar 2 Remunerations


Dhurandhar 2 Remunerations: రేపే 'ధురంధర్ 2' సునామీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో 100 కోట్లు, నటీనటుల పారితోషికాలు ఇవే!


బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్ 2'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ అవైటెడ్ మూవీగా సినీ లవర్స్‌తో పాటు సెలబ్రిటీలు సైతం ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ రేపు (మార్చి 19న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఈ చిత్రం షాక్‌కు గురిచేస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ రికార్డులు సృష్టిస్తే, రేపు థియేటర్లలోకి వచ్చాక ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


అక్షయ్ ఖన్నా గెస్ట్ రోల్‌కు భారీ డిమాండ్


మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంలో అక్షయ్ ఖన్నా పోషించిన 'రెహమాన్ డకాయత్' క్యారెక్టర్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. రణ్‌వీర్ సింగ్‌ను మించి ఈ పాత్రకు, అక్షయ్ ఖన్నా స్వాగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఈ సీక్వెల్‌లో కూడా రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించనుందని సమాచారం. అయితే, ఈ చిన్న గెస్ట్ రోల్ కోసం అక్షయ్ ఖన్నా ఏకంగా రూ. 2.5 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేసి తీసుకున్నారని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ వల్లే ఆయన క్రేజ్ ఈ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.


రణ్‌వీర్, మాధవన్ సహా మిగతా వారి పారితోషికాలు ఇవే..


ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ కోసం హీరో రణ్‌వీర్ సింగ్ ఏకంగా రూ. 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ సమాచారం. ఇక ఫస్ట్ పార్ట్‌లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. సెకండ్ పార్ట్‌లో ఆ పాత్ర నిడివి మరింత పెరగడంతో రూ. 10 కోట్లు డిమాండ్ చేశారట. 


అలాగే 'అజిత్ ధోవల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో షో రన్నర్‌గా నటిస్తున్న ఆర్. మాధవన్‌కు రూ. 9 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న వారిలో అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ఉన్నారు. వీరు చెరో రూ. కోటి పారితోషికంతో సరిపెట్టుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా, భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.