Pawan Kalyan: మోహన్ రాజాతో పవన్ మూవీ.. రూమర్లకు చెక్!

naveen
By -

Pawan Kalyan


Pawan Kalyan: డైరెక్టర్ మోహన్ రాజాతో పవన్ కళ్యాణ్ సినిమా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరోవైపు సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు మోహన్ రాజా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతుందంటూ వినిపించిన వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ లాంటి హిట్ కొట్టిన మోహన్ రాజా, ఇప్పుడు పవన్‌ను కూడా సరికొత్తగా చూపించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపించింది.


ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు


అయితే, పవన్ కళ్యాణ్, మోహన్ రాజా కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సినీ వర్గాల ద్వారా స్పష్టమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దర్శకుడు మోహన్ రాజాకు కేవలం అడ్వాన్స్ ఇచ్చిందనే టాక్ మాత్రమే నిజమని, పవర్ స్టార్‌తో సినిమా గురించి అసలు ఎలాంటి ప్రతిపాదనలు లేవని క్లారిటీ వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి చెక్ పడినట్లయింది.


పవన్ తదుపరి క్రేజీ లైనప్ ఇదే..


పవన్ కళ్యాణ్ వాస్తవ లైనప్‌లో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. ఆయన లైనప్‌లో 'ఓజీ' (OG) సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌తో పాటు 'హరిహర వీరమల్లు పార్ట్ 2' కూడా ఉన్నాయి. వీటితో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. పవన్ నుంచి ఇమ్మీడియేట్‌గా సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా సురేందర్ రెడ్డిదేనని ఇన్‌సైడ్ టాక్. 'ఓజీ', 'వీరమల్లు' సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో రచ్చ చేయడానికి ముస్తాబవుతోంది.