Prabhas Fauji: ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్‌పై క్లారిటీ.. ఎట్టి పరిస్థితుల్లో దసరాకే డార్లింగ్ సెన్సేషన్!
వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ సిద్ధమవుతున్నారు. డార్లింగ్ లైనప్‌లో ఉన్న మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ వార్ డ్రామా ‘ఫౌజీ’ ఒకటి. ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది (2026) దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే, ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడం కష్టమని, రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ, ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. ఏది ఏమైనా సరే ఈ చిత్రాన్ని 2026 విజయదశమికి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో దసరా పండుగ సీజన్ పెద్ద సినిమాలకు బాక్సాఫీస్ వద్ద బాగా కలిసొచ్చే సమయం. అందుకే, ఆ లోపే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
డైరెక్టర్ హను రాఘవపూడి విజన్, టేకింగ్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ఆయనకు బడ్జెట్ పరంగా, మేకింగ్ పరంగా పూర్తిగా 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చినట్లు సమాచారం. టెక్నికల్ వాల్యూస్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, అనుకున్న సమయానికి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకురావడమే లక్ష్యంగా మూవీ టీమ్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది.
షెడ్యూల్స్ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ ఏడాది జూలై లేదా ఆగస్టు నెలాఖరుకల్లా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ ఈ చిత్రంతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా లెవల్లో తనదైన సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

