Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి రేట్లు

naveen
By -
Gold Price Today


Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. పెళ్లిళ్ల సీజన్‌లో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు!


బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా ఊరటనిచ్చే వార్తే. గత కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటం, ఈ సమయంలోనే రేట్లు కాస్త దిగివస్తుండటంతో మన వరంగల్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మరికొన్ని రోజుల పాటు ఈ ధరల పతనం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ వారం ప్రారంభంలోనే (సోమవారం) పసిడి, వెండి ధరలు మరోసారి స్వల్పంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.


హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు వరంగల్ లాంటి నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ. 1,59,650 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది పది రూపాయలు తగ్గింది. నిన్న ఈ ధర రూ. 1,59,660 వద్ద స్థిరపడింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,46,340 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆదివారం నాడు ఈ ధర రూ. 1,46,350 వద్ద నమోదైంది. రేట్లలో మార్పు స్వల్పమే అయినప్పటికీ, ట్రెండ్ మాత్రం తగ్గుదల వైపే ఉండటం సామాన్యులకు ఉపశమనం కలిగించే అంశం.


దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,61,010 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,47,590 వద్ద కొనసాగుతోంది. మన పొరుగున ఉన్న బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,59,650 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,46,340 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,59,800 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,46,490గా నమోదైంది.


బంగారం దారిలోనే వెండి ధరలు కూడా దిగివచ్చాయి. నిన్నటి వరకు హైదరాబాద్, చెన్నై నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2.80 లక్షల వద్ద ఉండగా, ఈరోజు అది కాస్త తగ్గి రూ. 2,79,900 వద్ద కొనసాగుతోంది. అలాగే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,74,900 గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఈ నగరాల్లో వెండి ధరపై వంద రూపాయల మేర తగ్గుదల కనిపించింది. నిన్న ఢిల్లీ, బెంగళూరులో కేజీ వెండి రూ. 2,75,000 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే.