Middle East War Updates: బంకర్‌లో చావుబతుకుల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్.. ది గార్డియన్ ఇంటర్వ్యూలో సంచలనాలు

naveen
By -

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై అంతర్జాతీయ మీడియాలో సంచలన వార్త లీక్ అయింది. ఫిబ్రవరి 28న తన తండ్రిని బలిగొన్న అదే క్షిపణి దాడిలో మొజ్తబా కాళ్లు, చేతులు కోల్పోయి చావుబతుకుల మధ్య ఉన్నాడట! కనీసం మాట్లాడలేని స్థితిలో బంకర్‌లో దాక్కున్న ఒక నాయకుడి చేతిలో ఇప్పుడు ఇరాన్ భవితవ్యం ఉంది. "వాడిని బతకనివ్వను" అని ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో.. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. అసలు ఆ రోజు దాడిలో ఏం జరిగింది? ఈ పరిణామాలతో సామాన్యుడి జేబుకు రాబోయే నష్టం ఏంటో చూద్దాం.


Middle East War Updates


కాళ్లు, చేతులు ఛిద్రం.. చావుబతుకుల మధ్య మొజ్తబా!


సుప్రీం లీడర్ గా ఎన్నికైనప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ కనీసం ఒక వీడియో సందేశం కూడా ఎందుకు ఇవ్వలేదన్న అనుమానాలకు సైప్రస్‌లోని ఇరాన్ రాయబారి 'అలీరెజా సలారియన్' తెరదించారు. ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు.


ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్‌లోని అధ్యక్ష భవనంపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన భీకర క్షిపణి దాడి సమయంలో మొజ్తబా తన తండ్రి అలీ ఖమేనీ పక్కనే ఉన్నాడు. ఆ భయంకరమైన పేలుళ్లలో ఆయన కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.


ప్రస్తుతం ఆయన కనీసం మాట్లాడగలిగే స్థితిలో కూడా లేరని, ఒక రహస్య బంకర్‌లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని సలారియన్ కన్ఫర్మ్ చేశారు. ఏ క్షణాన ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేస్తుందో అన్న భయంతోనే ఆయన బయటకు రావడం లేదని స్పష్టమవుతోంది.


ఆ ఒక్క దాడితో తుడిచిపెట్టుకుపోయిన కుటుంబం..


పవిత్ర రంజాన్ మాసం 10వ రోజున జరిగిన ఈ దాడి ఇరాన్ చరిత్రలోనే అత్యంత చీకటి రోజుగా మిగిలిపోయింది. ఆ ఒక్క క్షిపణి దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, 14 నెలల చిన్నారి మనవడు కూడా అక్కడికక్కడే మరణించారు.


వీరితో పాటు అగ్రశ్రేణి సైనిక కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. సుప్రీం లీడర్ నివాసం, కార్యాలయం ఒకే చోట (అధ్యక్ష భవనం) ఉండటం వల్లే ఇజ్రాయెల్ దాడులకు అది సులభమైన లక్ష్యంగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


వదిలే ప్రసక్తే లేదు.. డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్


ఒకవైపు గాయాలతో, కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతో పోరాడుతున్న మొజ్తబాకు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.


ఫాక్స్ న్యూస్‌ (Fox News) తో మాట్లాడిన ట్రంప్.. "మోజ్తబా ప్రశాంతంగా బతకలేడు" అని స్ట్రాంగ్ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ ఎంచుకున్న ఈ కొత్త లీడర్ పట్ల తాను ఏమాత్రం సంతోషంగా లేనని, ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా మార్చే విషయంలో అమెరికా పాత్ర కచ్చితంగా ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.


ఒక దేశానికి సుప్రీం లీడర్ గా ఎన్నికైన వ్యక్తి కనీసం టీవీలో కనిపించి మాట్లాడలేని దయనీయ స్థితిలో ఉన్నాడంటే.. ఇరాన్ ఎంతలా భయపడుతోందో, వ్యవస్థ ఎంతలా కుప్పకూలిందో అర్థమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు డైరెక్ట్ గా ప్రతికారం తీర్చుకునే సత్తా ఇరాన్‌కు లేకపోయినా.. ప్రాక్సీల ద్వారా ముడిచమురు రవాణా మార్గాలను దిగ్బంధిస్తే మాత్రం గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుంది. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు లేవు.